Link copied!
Sign in / Sign up
0
Shares

అప్పుడే పుట్టిన ఆడపిల్లను వీధిలోకి విసిరేసిన మహిళ : సీసీ టీవీలో రికార్డ్ అయిన వీడియో

అప్పుడే పుట్టిన పసి బిడ్డని నిర్ధాక్షిణ్యంగా వీధుల్లో వదిలేసి వెళ్లిపోయింది ఓ తల్లి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఈ ఘటన జరిగింది. అది ఆ వీధిలో ఉన్న సీసీ టీవీ లో రికార్డ్ చేయబడింది. అందులో ఆమె ముఖం మొత్తం కప్పుకుని ఉంది. ఆ వీడియో ఫుటేజ్ లో ఆమె కార్ నుండి కిందకు కూడా దిగకుండానే కార్ అద్దం నుండి పాపని అక్కడే వదిలేసి వెళ్లిపోయింది.

ఆడపిల్ల పుట్టిందని.. 

మానవత్వం రోజురోజుకీ దిగజరిపోతుంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. ఇలాంటి వారిని చూసినపుడే మనుషులకన్నా జంతువులే చాలా నయం అనిపిస్తుంది. వాటి పిల్లల్ని చిన్నపుడు పాలు ఇచ్చి పెంచి పెద్దయ్యాకే అవి వదిలేస్తాయి. కానీ ఇలాంటి మనసు లేని తల్లులు మాత్రం కళ్ళు కూడా తెరవని పసి కందుల్ని దిక్కూ మొక్కు లేని అనాథల్ని చేస్తున్నారు. చేయాల్సిన తప్పులన్నీ వీళ్ళు చేస్తే శిక్ష మాత్రం లోకం తెలియని పసివారు అనుభవిస్తున్నారు. ఈ పని చేస్తున్నప్పుడు ఆ మనసు లేని తల్లి ముఖానికి స్క్రాప్ కట్టుకుంది.. అవసరం అయిన సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఆ మహిళ చేసిన తప్పుకు ఆ బిడ్డ శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేది కాదు.

Video Credits : E thuthang

ఇప్పుడు ఆ బిడ్డకి వైద్యం అందిస్తున్నారు కానీ విషమ పరిస్థితులలో ఆ ప్రాణం కొట్టుమిట్టాడుతోంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon