Link copied!
Sign in / Sign up
0
Shares

ఆడపిల్ల పుట్టిందని తెలిసి టాయిలెట్ లో వదిలేసిన తల్లితండ్రులు..!! 😥😥

ఆడపిల్ల పుడితే అమ్మ పుట్టిందిరా అని అంటారు. అలా ఎవరు ఎందుకు చెప్పారో గానీ ఆడపిల్ల గొప్పదనం తెలిసిన వారికే బహుశా అర్థమవుతుందేమో. ఎవరు పుట్టినా ఒకటే కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని చూసుకోవాల్సిన తల్లితండ్రులు కడుపు చీల్చుకు వచ్చిన ఈ లోకంలో అడుగుపెట్టిన ఆడబిడ్డను మాకు వద్దని హాస్పిటల్ టాయిలెట్ లో వదిలేసి ఫ్లష్ చేసి వెళ్లిపోయారు. అసలు ఏం జరిగిందో తెలిస్తే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది.

కన్న కూతురు అని కూడా చూడకుండా…

కూతురు పుట్టిందని తెలిసి ఓ తల్లితండ్రులు తమ బిడ్డను క్లినిక్ లోని టాయిలెట్ లో పడేసి కిందకు జారిపోయేలా నీటితో ఫ్లష్ చేశారు. టాయిలెట్ లో నీరు వెళ్లడం లేదని హాస్పిటల్ వాళ్ళు ప్లంబర్ కు ఫోన్ చేశారు. ప్లంబర్ వచ్చి చాలాసేపు ప్రయత్నించినా కూడా అర్థం కాలేదు. కొద్దిసేపు తర్వాత బంతి ఆకారంలో కనిపించింది. వెంటనే అక్కడున్న వాటర్ మొత్తం క్లియర్ చేశారు. అప్పుడే పుట్టిన పసికందును టాయిలెట్ లో పడేసి వెళ్లిపోయారని షాక్ అయ్యారు.

తల బయటకు వచ్చేసింది

ఎంతో ఇబ్బందిపడి బిడ్డను పైకి లాగుదామని ప్రయత్నం చేయగా రెండు రోజుల పసికందు కావడంతో తల శరీరం నుండి వేరు అయ్యింది. ఎంతో కష్టపడి మిగతా శరీరాన్ని బయటకు తీయగలిగారు. ఈ బాధాకరమైన సంఘటన కేరళలోని పాలక్కడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని పోలీసులకు తెలుపగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చిన్నారిని ఇలా ఎవరు చేసి ఉంటారనేది తెలుసుకోవడానికి సీసీ టీవీ ఫుటేజీలో చెక్ చేస్తున్నారు.

మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టేలా చేస్తున్న ఈ ఘటన నిజంగా బాధాకరం. దయచేసి మరో ఆడబిడ్డకు ఇలా జరగకూడదని ఆశిద్దాం.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon