Link copied!
Sign in / Sign up
10
Shares

ఆడపిల్ల పుట్టిందని చెత్తకుప్పలో పడేసిన కనికరం లేని తండ్రి : సీసీ టీవీలో రికార్డ్ అయిన వీడియో

ఆడపిల్ల జన్మిస్తే అమ్మ పుట్టిందని అంటారు, కానీ ఇతను తన భార్యకు ఆడపిల్ల జన్మించిందని ఎవరూ చూడకుండా చెత్తకుప్పలో పడేశాడు. ఎందుకు ఈ భూమి మీదకు వచ్చానో అని తెలియని చిన్నారి కొన్ని నిముషాల పాటు ఏ తప్పు చేయకుండానే నరకం అనుభవించింది.  అమాయకుల పాలిట, పిల్లల పాలిట ఎప్పుడు దేవుడు ఉంటాడని నిరూపించడానికి ఆ పాప ప్రాణాలు కాపాడు.  ఈ అద్భుతం ఎలా జరిగిందో చూడండి..

ప్లాస్టిక్ బ్యాగ్ లో తీసుకెళ్లాడు

ఇంట్లో చెత్తను బయటపడేయడానికి ఒక ప్లాస్టిక్ కవర్ లో తీసుకెళ్లడానికి ఉపయోగించినట్లు, రెండు గంటల క్రితమే పుట్టిన సొంత కూతురుని వదిలించుకోవడానికి ఈ హృదయం లేని తండ్రి చెత్త బుట్టలో పడేశాడు. తనకేమీ తెలియదన్నట్లుగా అభం శుభం ఎరుగని ఆ చిన్నారిని చెత్తకుప్పలో లో పడేసి చేతులను పాకెట్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. కనికరం లేకుండా ఇతను చేసిన ఈ పని మొత్తం సీసీ టీవీలో రికార్డ్ కావడంతో ఇది గమనించిన  ఇంటి వాళ్ళు పోలీస్ అధికారులకు ఫోన్ చేశారు.

పాప ప్రాణాలను కాపాడిన వృద్ధురాలు

రోడ్ పై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదైనా వాసన కలిగితేనే అటు నుండి దూరంగా వెళ్ళిపోతాం. అలాంటిది భరించలేని చెత్తకుప్పలో 10 c డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉండిపోయింది. ఎందుకు నన్ను పుట్టించావ్, నేనేం పాపం చేశాను అని రెండుగంటల శిశువుకు అనిపించేలా చేశాడు. ఐతే కొన్ని నిముషాల తర్వాత అక్కడ ఉన్న పురుగులకు, వాసనకు పాప ఊపిరి ఆడక ఏడవటంతో అక్కడ ఉన్న ఓ వృద్ధురాలు తన చేతుల్లోకి తీసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లింది. దేవుడి దయవల్ల ఆ పాప ప్రాణాలతో క్షేమంగా ఉంది.

పాపను ఎందుకు చంపాలనుకున్నాడంటే

పెళ్లి చేసుకోకుండా తన ప్రేయసితో కలిసి ఉంటున్నాడు ఈ వ్యక్తి. కలిసి చేసిన తప్పుతో ఆమెకు 8 నెలలు. ఈ సమయంలో కడుపులో నొప్పిగా ఉండటంతో హాస్పిటల్ కు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయారు. కొన్ని గంటల తరువాత ఆమె పండంటి అందమైన పాపకు జన్మను ఇచ్చింది. ఐతే రెండు గంటల ఆ పాప శరీరం నీలం రంగులోకి మారుతుండటంతో హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా చెత్తకుప్పలో పడేశాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. ఈ నీచమైన సంఘటన చైనాలో చోటుచేసుకుంది. ఆ వీడియో ఇదే..

Video Credits : HD Tv

సొంత కూతురుని ఇలా చెత్తకుప్పలో వేసి,  అమ్మతనాన్ని అవమానిస్తున్న ఇలాంటి వాళ్ళను ఏం చేయాలో మీరే చెప్పండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon