తల్లి, బిడ్డ ఖచ్చితంగా ఉపయోగించాల్సిన 6 సహజమైన ఆయుర్వేద ఉత్పత్తులు
మన దేశంలో ఆయుర్వేద వస్తువుల వాడకం కొన్ని వేల సంవత్సరాల నుండే మొదలైంది. ఆయుర్వేదంలో తల్లికి, బిడ్డకు ఉపయోగపడే ఎన్నో వస్తువులు ఉన్నాయి. ప్రకృతిలో దొరికే ఈ సహజమైన ఆయుర్వేద వస్తువులుతో తయారు చేయబడిన ఉత్పత్తులు, కొన్ని ఏళ్ళ నుండి తల్లి బిడ్డను సంరక్షిస్తున్నాయి. అలాంటి అద్భుతమైన ఆయుర్వేద ఉత్పత్తులు గురించి మీరు కూడా తెలుసుకోండి…
1.కొబ్బరినూనె
మనకు చాలా సులువుగా దొరికేదే, కొబ్బరినూనె వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని మనకు తెలిసిందే. కానీ ఇందులో ఆయుర్వేద లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే సహజమైన కొబ్బరినూనె దొరకడం చాలా కష్టం. కొబ్బరినూనె వాడటం వల్ల మీ జుట్టుకు మంచి పోషణ అంది దృడంగా మారుతాయి. దీనిని బిడ్డ శరీరానికి కూడా పూయవచ్చు.
2.నింబా ప్యూరిఫైంగ్ సోప్
బిడ్డకి స్నానం చేయించడం అన్నది ప్రతిరోజూ చేయాల్సిన పని. పూర్తి సహజంగా తయారైన నింబా ప్యూరిఫైంగ్ సోప్‌ను వాడటం వల్ల చర్మం కోమలంగా తయారవుతుంది. ఇందులో ఉండే నిమ్మ, కొబ్బరి, పసుపు వంటివి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.
3.కొకుం అండ్ ఆల్మండ్ బటర్
ఈ క్రీమ్‌ను శరీరానికి రాయడం వలన మంచి ఫలితం ఉంటుంది. వీటిలో కొబ్బరి, బాధం, ఆలివ్ ఆయిల్‌తో పాటూ కోకో, కొకుం బటర్ ఉంటాయి. వీటి వల్ల శరీరానికి కాంతి రావడంతో పాటూ, చర్మం మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయి.
4.బాదం నూనె
బాధం నూనెను మీ శరీరం పై రాయడం వలన అనేక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఇది మీ బిడ్డ తలకి కూడా పెట్టవచ్చు. దీనిని రాసుకోవడం వల్ల మీ ముఖం మీద ఉండే మచ్చలు లేదా వలయాలు మాయమయ్యి మీరు మునుపటిలా అందంగా తయారవుతారు.
5.సాధారణ నిరల్ సోప్
సహజమైన పద్ధతిలో తయారు చేసిన నిరల్ సోప్‌ను బిడ్డ బాడీ సోప్‌గా ఉపయోగించచ్చు. దీనితో స్నానం చేయించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇందులో కొబ్బరి, కోస్టర్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటీవి ఉండటం వల్ల చర్మం సున్నితంగా తయారవుతుంది. బేబికి ఇరిటేషన్ ఉన్నా, చర్మం ఎర్రగా మారుతున్నా ఈ సోప్‌ను వాడండి.
6.ధన్వంతరి తైలం
ప్రెగ్నెన్సీ తరువాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అందులో స్ట్రేట్ర్చ్ మర్క్స్ ప్రధానమైనవి. ధన్వంతరి ఆయిల్‌ను పొట్ట మీద మర్ధనా చేయడం వల్ల, అది మీ చర్మంలోకి వెళ్ళి చర్మానికి సాగే గుణాన్ని ఇస్తుంది. దీంతో స్ట్రెచ్ మార్క్స్ సంఖ్య చాలా వరకు తగ్గుతుంది. ఇది మీకు నొప్పి, అలసట నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది రాసిన 30 నిముషాల తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
