Link copied!
Sign in / Sign up
4
Shares

నర్సు చేసిన తప్పుకు 4 రోజుల బిడ్డ కాలును తీసేశారు : అసలు ఏం జరిగిందో చూడండి

ఆసుపత్రిలో నర్సు హెయిర్ డ్రైయర్ ను ఆన్ చేసి నిర్లక్ష్యంగా వొదిలేసిన కారణంగా.. ఒక నవజాత శిశువు వికలాంగుడు అయ్యాడు. నర్సు నిర్లక్ష్యం, 4 రోజుల శిశువుని వికలాంగుడిగా మార్చింది..! ఇది చైనా లో చోటు చేసుకున్న ఒక విషాదకరమైన సంఘటన.

అసలు ఏం జరిగిందంటే..

హెయిర్ డ్రైయర్ ను ఆన్ చేసి ఒకటినర్ర గంట పాటు శిశువు కాళ్ళ దగ్గర వదిలేసిన కారణంగా, ఈ శిశువు కాళ్ళు తీవ్రంగా గాయపడ్డాయి. వైద్యులు ఆ శిశువు ప్రాణాలను కాపాడటానికి కాలిన ఆ కాలును తొలగించవలసి వచ్చింది. పక్కనే ఉన్న, ఇంకా ఇద్దరు శిశువులకు కూడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి.

అకాల జననం కారణంగా ఈ శిశువులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో, ఇంక్యూబేటర్లలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆ గదిలోని సీసీటీవీ ఫుటేజీ ని పరిశీలించగా తెలిసినది ఏమిటంటే, అక్కడే పని చేస్తున్న ఒక నర్సు ఆ హెయిర్ డ్రైయర్ ను ఆన్ చేసి పిల్లల దగ్గర పెట్టి మర్చిపోయింది. దాంతో అక్కడ ఉన్న పసి బిడ్డలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా అదే గదిలో పని చేస్తూ ఉన్న ఇతర సిబ్బంది కూడా ఇది గమనించలేదు. ఈ శిశువులకు పరీక్షలు నిర్వహించడానికి, సంబంధిత వైద్యులు వచ్చినప్పుడు మాత్రమే ఇది గమనించబడింది. వెంటనే శిశువుకు తగిన చికిత్స చేసి కాపాడగలిగారు. ఈ విషయంలో బాధ్యత వహించిన ఇద్దరు నర్సులను ఆసుపత్రి నుండి తొలగించారు మరియు యాజమాన్యం పబ్లిక్ అపాలజీని జారీ చేసింది.

 ఆ శిశువు భవిష్యత్తు కోసం, తన బామ్మ అయిన శ్రీమతి యాన్ గారు, ఆసుపత్రి యాజమాన్యాన్ని నష్టపరిహారం చెల్లించవలసింది గా కోరుతున్నారు. ఈ వీడియో కాస్త ఇబ్బందికరంగా, మీ మనస్సును గాయపరిచేలా ఉంటుంది. అందుకని ఇక్కడ పోస్ట్ చేయడం లేదు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon