Link copied!
Sign in / Sign up
3
Shares

మీ పిల్లల కోసం నోరూరించే 7 రకాల అంబలి (గంజి, జావ) వంటకాలు : చాలా ఈజీగా మీరే చేసుకోవచ్చు..

అంబలిలో ఉన్న రుచి దేనిలోనూ ఉండదు. చిన్న నుంచి పెద్ద, ముసలి అంతా లొట్టలేసుకుంటూ లాగించే అంబలి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అంతే కాదు.. అంబలి ఎంతో చలువ చేస్తుంది. అందుకే ఎండాకాలంలో ఎక్కువగా అంబలిని ఆహారంలో భాగంగా చేర్చుతుంటారు. మండు వేసవిలో పిల్లలకు కూడా అంబలిని తినిపిస్తే ఎంతో మంచిది. అయితే.. అంబలి రకరకాలుగా చేసుకోవచ్చు. అంబలిని తయారుచేయడానికి ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. క్షణాల్లో అంబలిని తయారుచేసుకోవచ్చు. మరి.. పిల్లలు లొట్టలేసుకుంటూ అంబలిని లాగించాలంటే ఈ ఏడు రకాల అంబలి వంటను ట్రై చేయండి. సరేనా..

1. యాలకులు, గోధుమ రవ్వ అంబలి

కావాల్సిన పదార్థాలు

గోధుమ రవ్వ – 3 టేబుల్ స్పూన్లు

పెసరు పప్పు - రెండున్నర టేబుల్ స్పూన్లు

యాలకులు – 3

తయారుచేయు విధానం

పెసరు పప్పు, గోదుమ రవ్వ, యాలకులను కొద్ది సేవు విడివిడిగా వేయించండి. అనంతరం వాటిని సపరేట్ గా మిక్సీ పట్టండి. వాటి మిశ్రమాలుగా కలిపేయండి. ఆ మిశ్రమంలో కొద్దిగా వేడి నీళ్లు కలపండి. కొంచెం సేపు ఆ మిశ్రమాన్ని కలియబెట్టండి. అంతే.. గోదుమ రవ్వ, యాలకుల అంబలి రెడీ. ఈ అంబలిని ఒక్కసారి తిన్నారంటే మీ పిల్లలు మళ్లీ మళ్లీ కావాలంటారు.

2. బియ్యం, పెసరు పప్పుతో చేసే అంబలి

కావాల్సిన పదార్థాలు

బియ్యం – మూడు టేబుల్ స్పూన్లు

పెసరు పప్పు(పొట్టు తీసింది) - రెండు టేబుల్ స్పూన్లు

తయారు చేయు విధానం

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. తర్వాత మిక్సీ పట్టండి. పప్పును కొద్దిగా వేయించి మిక్సీ పట్టండి. అనంతరం రెండింటి మిశ్రమాన్ని కలపండి. ఆ మిశ్రమానికి కొద్దిగి వేడి నీళ్లు కలిపి బాగా కలియబెట్టండి. అంతే బియ్యంతో తయారు చేసిన అంబలి రెడీ.

3. తేనె, ఓట్స్ అంబలి

కావాల్సిన పదార్థాలు

పాలు – ముప్పావు కప్పు

ఓట్స్ తగినన్ని, తేనె ఒక టేబుల్ స్పూన్.

తయారు చేయు విధానం

పాలను బాగా వేడి చేయండి. బాగా వేడెక్కాక అందులో ఓట్స్ ను కలపండి. ఓట్స్ పాలల్లో నానిన తర్వాత బాగా కలపండి. మంటను ఆపేసి ఆ మిశ్రమంలో కాసింత తేనె వేయండి. అంతే.. తియ్య తియ్యని తేనె, ఓట్స్ అంబలి రెడీ.

4. మొక్కజొన్న అంబలి

కావాల్సిన పదార్థాలు

మొక్కజొన్న పొడి – 4 టేబుల్ స్పూన్లు

పెసర పప్పు పొడి – 4 టేబుల్ స్పూన్లు

నువ్వుల పొడి – సగం టేబుల్ స్పూన్

తయారు చేయు విధానం

ఈ పొడులనన్నింటినీ వేర్వేరుగా వేయించండి. తర్వాత వాటిని ఓ మిశ్రమంగా కలిపేయండి. ఆ మిశ్రమాన్ని వేడి నీళ్లకు కలపండి. తర్వాత దాన్ని బాగా కలపండి. బాగా కలపడం వల్ల మిశ్రమం ముద్దలుగా కాకుండా బాగా మిక్స్ అవుతుంది. అంతే.. మొక్కజొన్న అంబలి రెడీ అయినట్లే.

5. సోయాబీన్, గోదుమ అంబలి

కావాల్సిన పదార్థాలు

గోదుమలు – 5 టేబుల్ స్పూన్లు

సోయాబీన్ గింజలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్

తయారుచేయు విధానం

గోదుమలు, సోయాబీన్ గింజలను బాగా వేయించాలి. వాటిని సపరేట్ గా మిక్సీ పట్టండి. అనంతరం రెండు మిశ్రమాలకు కలపండి. ఆ మిశ్రమానికి కొన్ని వేడినీళ్లను కలిపి బాగా కలపండి. అంతే.. గోదుమలు, సోయాబీన్ తో చేసిన అంబలి రెడీ.

6. యాపిల్, రాగి అంబలి

కావాల్సిన పదార్థాలు

రాగి పిండి – రెండు టేబుల్ స్పూన్లు

సగం యాపిల్

తయారుచేయు విధానం

సగం యాపిల్ ను ముక్కలు ముక్కలుగా చేయండి. దాన్ని మిక్సీ పట్టండి. రాగి పిండిని కలిపి, కొన్ని నీళ్లు పోసి కొంచెం సేపు మంట మీద పెట్టండి. అనంతరం రాగి పిండిని యాపిల్ మిశ్రమంలో కలపండి. అంతే.. యాపిల్, రాగి అంబలి రెడీ.

7. వేరుశనగ, గోదుమ అంబలి

కావాల్సిన పదార్థాలు

వేరుశనగలు – 3 టేబుల్ స్పూన్లు

గోదుమలు – 3 టేబుల్ స్పూన్లు

పెసలు – రెండున్నర టేబుల్ స్పూన్లు

తయారు చేయు విధానం

వేరుశనగ, గోదుమలు, పెసర్లను బాగా వేయించండి. వేయించన అనంతరం వాటన్నింటినీ కలిపి మిక్సీ పట్టండి. ఆ మిశ్రమానికి 4 స్పూన్ల వేడి నీళ్లను కలపండి. అనంతరం దాన్ని బాగా కలిపి మీ పిల్లలకు తినిపించడమే.

ఈ 7 రకాల అంబలిలను ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా.. మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలకు కోసం రెడీ చేయండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon