Link copied!
Sign in / Sign up
2
Shares

9వ నెల ప్రెగ్నన్సీ సమయంలో తినకూడని ఆహారాలు మరియు తినాల్సిన ఆహారాలు ఇవే..

మీరు ప్రేగ్నన్ట్ అయ్యాక అన్ని నెలలు ఒక ఎత్తు, 9 వ నెల ఒక ఎత్తు. మీరు ప్రెగ్నన్సీ సమయంలోని అన్ని నెలలు ఎంత జాగ్రత్తగా ఉన్నా, 9వ నెల ఆ జాగ్రత్తలు రెండింతలు  అవ్వాలి. ఎందుకంటే 9వ నెలలో ఏమైనా జరగచ్చు. ఇన్ని రోజులు కడుపులో దాచుకుని కాపాడుకున్న బిడ్డను పోగొట్టుకోవాలని ఎవ్వరు అనుకోరు. 9 వ నెలలో మీరు తీసుకోవాల్సిన అనేక జాగ్రత్తలలో ఆహరం చాలా ముఖ్యమైనది. 9 నెలలో ఎలాంటి ఆహారాలు తినాలో,  ఎలాంటి ఆహారాలు తినకూడదో ఇక్కడ తెలుసుకోండి…

తినాల్సిన ఆహారాలు:
1. పీచు పదార్ధాలు

కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు లాంటి అధికంగా పీచు కలిగిన ఆహారాలు 9వ నెలలో తీసుకోవాలి. వీటిలోని పీచు మీ అరుగుదల సాఫీగా జరిగేలా చేస్తుంది. మీకు కావాల్సిన శక్తి అందుతుంది.

2. ఐరన్ కలిగిన ఆహారాలు

 

ఐరన్ కలిగిన చేప, చికెన్, గుడ్లు, పప్పు దినుసులు, బఠాణీలు, బెర్రీస్, సొయా బీన్స్, డ్రై ఫ్రూట్స్ మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇవి రక్త హీనత సమస్యలు రాకుండా చేస్తాయి.

3. కాల్షియమ్ కలిగిన ఆహారాలు

9వ నెల ప్రెగ్నన్సీ సమయంలో మీ శరీరంలో కాల్షియమ్ తగ్గుతుంది. అందుకే మీరు కాల్షియమ్ అధికంగా ఉన్న, నువ్వులు, పాల ఉత్పత్తులు, ఓట్స్ మీ ఆహారంలో చేర్చుకోండి.

4. విటమిన్ ‘సి’ కలిగిన ఆహారాలు

టొమాటో, స్ట్రా బెర్రీస్, కాలీఫ్లవర్, సిట్రస్ ఫ్రూట్స్ లో అధికంగా వుండే విటమిన్ ‘సి’ మీకు  9వ నెలలో చాలా అవసరం.

5. ఫోలిక్ ఆసిడ్ కలిగిన ఆహారాలు

పిల్లలలో పుట్టుక లోపాలు రాకుండా ఉండాలంటే, 9వ నెల ప్రెగ్నన్సీ సమయంలో ఫోలిక్ ఆసిడ్ కలిగిన ఆహారాలు తీసుకోవాలి. ఆకు కూరలు, చిక్కులు, కూరగాయలు, గింజలు, లాంటి ఆహారాలలో ఫోలిక్ ఆసిడ్ అధికంగా ఉంటుంది.

6. విటమిన్ ‘ఏ’ కలిగిన ఆహారాలు

పాల కూర, క్యారెట్స్, గనిసి గెడ్డలు, కిరిని పండు లాంటి వాటిలో విటమిన్ ‘ఏ’ అధికంగా ఉంటుంది. 9 వ నెల ప్రెగ్నన్సీ సమయంలో మీకు విటమిన్ ‘ఏ’ చాలా అవసరం.

తినకూడని ఆహారాలు:
1. కెఫీన్

వీలున్నంత వరకు కెఫీన్ తో కూడిన ఆహారాన్ని తీసుకోకండి. ఒకే వేళ కాఫీ లాంటి పదార్ధాలు తీసుకోవడం మీకు అలవాటు ఉంటే రోజుకు అరకప్పు మించకుండా తీసుకోండి.

2. చక్కర

9 నెల ప్రెగ్నన్సీ సమయంలో చక్కెరకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చక్కర గలిగిన స్వీట్స్, చాక్లేట్లు, లాంటి వాటికి దూరంగా ఉండండి. అవి రకతంలోని గ్లూకోస్ శాతాన్ని పెంచుతాయి. అది మీకు బిడ్డకు ప్రమాదం.

3. సీ ఫుడ్

కొన్ని సముద్ర చేపలలో మెర్క్యూరీ శాతం ఎక్కువగా ఉంటుంది. మీరు సరిగా ఉడికించకుండా లేదా పచ్చి వాటిని ఆహారంగా తీసుకున్నప్పుడు ఆ మెర్క్యూరీ మీ కడుపులోకి చేరుతుంది. అది బిడ్డకు ప్రమాదం. 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon