Link copied!
Sign in / Sign up
0
Shares

9 ఏళ్ళ ఈ బాబు ఈ క్రిస్మస్ వరకు బ్రతకడం కష్టమే అని తెలిసి ప్రపంచానికి తల్లితండ్రులు ఇచ్చిన గొప్ప సందేశం

పేరు : జాకోబ్ థామ్సన్, వయస్సు : 9 ఏళ్ళు, వ్యాధి : న్యూరోబ్లాస్టోమా (అరుదైన క్యాన్సర్).. ఇది ఈ 9 ఏళ్ళ చిన్నారి అనారోగ్య సమస్య. అల్లారుముద్దుగా తమ మధ్య పెరిగిన 9 ఏళ్ళ కొడుకు క్రిస్మస్ వరకు బ్రతకడం కష్టం అని తెలియడంతో, తమ బిడ్డను ఎలాగైనా సంతోషంగా ఉంచాలని జాకోబ్ తల్లితండ్రులు తమ బిడ్డ కోసం చేసిన పని అందరినీ ఆకట్టుకుంటుంటే, మరోవైపు కన్నీరును తెప్పిస్తోంది. ఇంతకీ ఆ తల్లితండ్రులు బిడ్డ కోసం ఏం చేశారో చూడండి..

న్యూరోబ్లాస్టోమా అంటే ఏమిటి?

సాధారణంగా 10 ఏళ్ళ వయస్సు, అంతకంటే తక్కువ వయస్సులో అతి సాధారణంగా చిన్నపిల్లలలో వచ్చే క్యాన్సర్. ఛాతీ లేదా పొత్తి కడుపుపైన ఈ క్యాన్సర్ కణతి ఏర్పడి తల నుండి మెదడుకు వ్యాపిస్తుంది. ఈ అరుదైన వ్యాధితో జాకోబ్ థామ్సన్ గత కొన్ని రోజులుగా బాధపడుతున్నాడు. డాక్టర్లు జాకోబ్ క్రిస్మస్ వరకు కూడా బ్రతకడం కష్టం అని చెప్పడంతో 10 రోజులు ముందుగానే క్రిస్మస్ కానుకను బహుమతిగా ఇచ్చి ఆనందపరిచారు.

జాకోబ్ తల్లితండ్రులు చేసిన గొప్ప పని

జాకోబ్ కు క్రిస్మస్ అంటే చాలా ఇష్టం, స్నేహితులతో గడపడం ఇంకా ఇష్టం. అందుకని జాకోబ్ పేరెంట్స్ తమ బిడ్డ చికిత్స పొందుతున్న హాస్పిటల్ లో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసి, జాకోబ్ ఫ్రెండ్స్ మరియు బంధువులకు ఈ విషయం చెప్పి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. తమ బిడ్డ ఈ ప్రపంచానికి దూరమవుతున్నాడని బాధపడి, జాకోబ్ ను బాధపెట్టేకన్నా సంతోషంగా ఉంచాలని కోరుకున్నారు. క్రిస్మస్ గ్రీటింగ్స్ మరియు బొమ్మలను జాకోబ్ కు పంపిస్తున్నారు.

నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నారు

జాకోబ్ నవ్వుతు ఉండాలని తన వ్యాధి కన్నా తనకోసం అండగా వచ్చిన వారితో ధైర్యం నింపాలని హాస్పిటల్ యాజమాన్యం కూడా, తమ హాస్పిటల్ అడ్రస్ ఇచ్చి జాకోబ్ కు క్రిస్మస్ గ్రీటింగ్స్ మరియు విషెష్ తెలియపరచవచ్చని చెప్పగా సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది తమ విషెస్ తెలుపుతున్నారు. నువ్వు నవ్వుతూ ఉండాలి, బ్రతకాలి అంటూ ధైర్యం చెబుతున్నారు.

ఈ వ్యాధికి మందు ఉందని వైద్యులు చెబుతున్నా, ఆ స్టేజ్ ఇప్పుడు దాటిపోయిందని చెబుతున్నారు..  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon