Link copied!
Sign in / Sign up
12
Shares

9 నెలల పసిబిడ్డను బ్యాట్ తో కొట్టి నేలపై పడేసింది : ఉరి శిక్ష విధించిన కోర్టు

తమ చిన్నారికి ఏం కాకుండా తనకేం కావాలో అంతా పనిమనిషే చూసుకుంటుందిలే అని నమ్మి వెళ్లిన ఆ తల్లితండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది ఓ పనిమనిషి. ఎలాంటి కనికరం లేకుండా 9 నెలల పసిబిడ్డను తీవ్రంగా కొట్టి ఆ పాప ప్రాణాలు పోవడానికి కారణమైంది. అసలు ఏం జరిగిందో తెలిస్తే ఆమెను మీరు కూడా క్షమించరు.

బ్యాట్ తో కొట్టి నేలపై విసిరిన పనిమనిషి

దుబాయ్ లోని షార్జాలో ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఓ మహిళ ఇంట్లో ఆ చిన్నారి తల్లితండ్రులు ఎవరూ లేని టైం చూసి 9 నెలల పసిబిడ్డను తీవ్రంగా బ్యాట్ తో కొట్టి రెండు చేతుల్లోకి తీసుకుని ఎత్తి నేలపై విసిరేసింది. దీంతో ఆ చిన్నారి ఉలుకుపలుకు లేకుండా ఉండిపోయింది. అరగంట గడిచిన తర్వాత ఆ పాప తల్లి ఇంటికి వచ్చి చూడగా నేలపై అపస్మారక స్థితిలో పడిఉన్న బిడ్డను చూసి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లింది. పనిమనిషి మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి అసలు నిజాలు బయటపెట్టారు పోలీసులు.

చేతి వేళ్ళ గుర్తులు కనుక్కున్నారు

ఇంటి నుండి ఆ చిన్నారి తల్లితండ్రులు వెళ్తున్నప్పుడు పాప పనిమనిషి దగ్గర సంతోషంగా ఉందని, బాగా ఆడుకుంటోందని, ఎప్పుడు ఆమె వల్ల మాకు ఇబ్బంది కలగలేదని ఆ పాప తల్లి చెప్పింది. ఐతే పోలీసుల విచారణలో బ్యాట్ పై ఉన్న చేతి వేళ్ళ గుర్తుల ఆధారంగా పనిమనిషే ఇందుకు కారణమని తేల్చి చెప్పారు. కాగా కోమాలోకి వెళ్లిన ఆ చిన్నారి ఇటీవలే ప్రాణాలు విడిచింది. పాప చావుకు కారణమైన ఆ పనిమనిషికి కోర్టు ఉరి శిక్ష విధించింది. తప్పు చేసినందుకు ఆమెకు తగిన శిక్ష విధించినా, మా పాప ప్రాణాలు ఎవరు తీసుకురాలేరు కదా అని ఆ చిన్నారి తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon