Link copied!
Sign in / Sign up
1
Shares

9 నెలల బాబు గుండెను 15 గంటలు ఆపివేసిన వైద్యులు : ప్రపంచాన్ని షేక్ చేసిన న్యూస్


ఒక్క క్షణం శ్వాస తీసుకోవడం కష్టమైతేనే ప్రాణాలు పోయినట్లుగా ఉంటుంది, అలాగే గుండె కొన్ని నిముషాలు కొట్టుకోకపోతే పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోండి. ఐతే ఇక్కడ కనిపిస్తున్న ఈ 9 నెలల బాబు గుండెను ఏకంగా 15 గంటల పాటు ఆపివేశారు వైద్యులు. 15 గంటల పాటు గుండెను ఆపింది కూడా ఈ బాబు ప్రాణాలను కాపాడటానికే. అసలు ఏం జరిగిందో తెలుసుకున్నాక డాక్టర్లు గొప్ప పని చేశారు అని మీకు అనిపిస్తే ఈ ఆర్టికల్ SHARE చేయగలరు.

పుట్టుకతోనే గుండెకు రంధ్రం

మీరు విన్నారో లేదో, అప్పుడప్పుడు కొందరు పిల్లలు పుట్టుకతోనే గుండెకు చిన్న రంధ్రంతో (గుండెలో చిల్లు) పుట్టారని. ఇక్కడ ఈ 9 నెలల నాథన్ బైర్నీ కూడా అదే సమస్యతో పుట్టాడు. బాబు ఇలా జన్మించడంతో ఈ పిల్లాడి పేరెంట్స్ భయపడిపోయారు. ఎందుకంటే బాబు మహా అంటే 6 నెలలు బ్రతకవచ్చిన డాక్టర్స్ చెప్పడమే ఇందుకు కారణం. తమ బాబును ఎలగైనా బ్రతికించాలని డాక్టర్లను అడిగారు ఆ పేరెంట్స్. బాబు ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రయత్నం చేస్తామని వైద్యులు ఆ పేరెంట్స్ కు భరోసా ఇవ్వడమే కాకుండా ఒక సవాల్ గా తీసుకున్నారు.

బాబుకు రెండుసార్లు ఆపరేషన్

నాథన్ బైర్నీ 3 నెలల వయసున్నప్పుడు మొదటిసారి బాబు గుండెకు ఉన్న రంధ్రాన్ని నార్మల్ గా ఉంచడానికి ఆపరేషన్ చేశారు కానీ ఇది సక్సెస్ కాలేదు. మళ్ళీ 9 నెలల వయస్సులో గుండెకు శస్త్ర చికిత్స చేశారు. బాబును ఐసీయూలో అడ్మిట్ చేసి గుండెను ఆపివేసి ఆపరేషన్ మొదలుపెట్టారు. ముందుగా 7 గంటల్లో ఈ ఆపరేషన్ పూర్తవవుతుందనుకున్నారు కానీ 15 గంటల సమయం పట్టింది.

ఆపరేషన్ జరిగిక ఇన్ఫెక్షన్స్

9 నెలల తమ బాబుకు 15 గంటల పాటు గుండెను ఆపివేసి ఆపరేషన్ చేస్తుండటంతో నాథన్ బైర్నీ తల్లితండ్రులు లెస్లీ, డేవిడ్ భయపడ్డారు. కానీ ఎక్కడో చిన్న ఆశ వైద్యులు తమ బాబు ప్రాణాలను కాపాడతారని. చివరి నిముషంలో డాక్టర్లకు కూడా చాలా టెన్షన్ వేసిందని, ఏది ఏమైనా బాబును సురక్షితంగా కాపాడామని ఆనందం వ్యక్తం చేశారు. ఆపరేషన్ జరిగిన తర్వాత ఇన్ఫెక్షన్స్ సోకడంతో 10 రోజుల పాటు హాస్పిటల్ లో ఉంచారు. ఆ తర్వాత తల్లి ఒడిలోకి చేరుకొని బిడ్డ సంతోషంగా ఉన్నాడు.

పుట్టుకతోనే ఈ ప్రపంచంలో గుండె సమస్యను ఎదుర్కుని, తల్లితండ్రులను టెన్షన్ పెట్టిన నాథన్ బైర్నీకి ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా జరిగిందని తెలియడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ SHARE చేశారు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon