Link copied!
Sign in / Sign up
2
Shares

7 ఏళ్ళ బాబు ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ : రైలు ఎక్కుతుండగా జరిగిన ఘటన

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ అప్రమత్తంగా ఉండటం వలన ఆ తల్లి కడుపుకోతను కాపాడాడు. అతను ఆ సమయానికి అక్కడ లేకపోయుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. మూడు రోజుల క్రితం ముంబైలో జరిగిన ఈ ఘటనలో 7 ఏళ్ళ బాబు ప్రాణాలు కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఆ వీడియో ఇదే…

Video Credites : The Times of India
అమ్మతో పాటు రైలు ఎక్కుతుంటే..

శుక్రవారం (ఫిబ్రవరి 2) అమ్మతో పాటు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్ళడానికి ముంబైలోని నయాగాన్ రైల్వే స్టేషన్ లో, అమ్మతో పాటు 7 ఏళ్ళ బాబు రైలు ఎక్కుతుండగా, రైలు కదలటంతో బాబు ఫ్లాట్ ఫామ్ నుండి కింద పడిపోతుండగా, అది చూసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ అప్రమత్తమై బాబు రైలు కింద పడిపోకుండా ప్రాణాలు కాపాడాడు. తన బాబు ప్రాణాలు కాపాడటంతో ఆ తల్లి ఒకవైపు కన్నీరు పెట్టుకుంటూ సంతోషంగా కృతఙ్ఞతలు తెలిపింది. నయాగాన్ రైల్వే స్టేషన్ లోని సీసీ కెమెరాలలో ఈ దృశ్యం రికార్డ్ అయ్యింది.

రైలు లేదా బస్సు ఎక్కేటప్పుడు మీరే కాకుండా మీతో పాటు ఉన్న పిల్లలపట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ వీడియో అందరికీ SHARE చేయండి..  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon