Link copied!
Sign in / Sign up
0
Shares

6 నెలల పసిబిడ్డను భవనంపై నుండి విసిరేసిన కన్న తండ్రి : అసలు ఏం జరిగిందంటే..

మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి నాన్న ఉన్నాడులే అని ధైర్యంగా ఉంటాం. అటువంటిది ఇక్కడ మాత్రం తమకు వచ్చిన సమస్యను పరిష్కరించుకోవడానికి ఓ తండ్రి ఏకంగా తన 6 నెలల పసిబిడ్డను భవనంపై నుండి కిందకు విసిరివేశాడు. ఐతే పోలీసులు ఆ బిడ్డను కాపాడటం జరిగింది. ఇలా ఆ తండ్రి ఎందుకు చేశాడో మీరే చూడండి..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా..

సౌత్ ఆఫ్రికాలో క్వాడ్వేసి అనే టౌన్ లో గల జాయ్ స్లోవో అనే కాలనీలో దాదాపు 90 ఇళ్లను ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించుకున్నారు. ఈ విషయం గవర్నమెంట్ కు తెలియడంతో వెంటనే ఆ ఇళ్లను కూల్చివేసి అక్కడున్న వారిని ఖాళీ చేయమని ఆదేశాలు జారీచేసింది. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని ఎటువంటి అనుమతి లేకుండా ఇక్కడ ఇళ్లను నిర్మించుకున్నందుకు వెళ్లిపోమని చెప్పగా ధర్నా చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేసి రోడ్ల దిగ్బంధం చేశారు. అయితే ఈ వ్యక్తి మాత్రం ఏకంగా తన 6 నెలల బిడ్డతో భవనం పైకి ఎక్కి కిందకు విసిరివేశాడు.

బిడ్డను కాపాడిన పోలీసులు

తమ ఇళ్లను కూల్చివేయవద్దని, ఇక్కడి నుండి వెళ్లిపోవాలని తమ సమస్యను పరిష్కరించకపోతే ఈ బిల్డింగ్ పై నుండి నా బిడ్డను కిందకు పడేస్తానని బెదిరించాడు. ఐతే పోలీసులు నెమ్మదిగా మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది, ఒక పోలీస్ నెమ్మదిగా భవనం పైకి చేరుకోవడం చూసి దగ్గరికి వస్తే కింద పడేస్తానని అన్నాడు. తనకు దగ్గరకు కన్న కొడుకుని కిందకు పడేశాడు. అయితే అదే టైంలో కింద పోలీసులు ఉండటంతో ఆ పసికందుకు ఏమీ కాకుండా కాపాడారు. బిడ్డను చంపడానికి ప్రయత్నం చేసినందుకు అతడిని అరెస్ట్ చేశారు.

ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఇలా కన్న బిడ్డను, పసికందు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించినందుకు సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అదే పోరాడి ఉంటే అండగా నిలబడేవాళ్లమని చెబుతున్నారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon