Link copied!
Sign in / Sign up
1
Shares

57 రోజుల బిడ్డను ఉయ్యాల నుండి కిందకు పడేసిన తండ్రి : భార్యపై కోపంతో..

పుట్టి రెండు నెలలు కూడా కాలేదు, తల్లి కడుపుని చీల్చుకుని ఆ కుటుంబంలో ఆనందాన్ని నింపడానికి వచ్చిన బిడ్డ, పాపం ఆ బిడ్డకు కూడా తెలియదేమో తన తండ్రి చేతుల్లోనే ప్రాణాలు వదిలేస్తానని. భార్యపై కోపంతో బిడ్డను బలి తీసుకున్న ఆ తండ్రికి ఇప్పుడు దక్కిందేమిటి? కొడుకు ఇక లేడు అనే ఆవేదన తప్ప. ఒక్క క్షణం  మాట్లాడుకుని పరిష్కరించుకునే చిన్న విషయానికి బిడ్డను పణంగా పెట్టుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందో తెలిస్తే ఎందుకిలా చేశారయ్యా అని అనకుండా ఉండలేరు..

చెప్పకుండా బాబును హాస్పిటల్ కు తీసుకెళ్లిందనే కారణంతో..

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో గల ఖానాపూర్ కు చెందిన షేక్ గౌడ్, షేక్ రిహానా బేగంలకు రెండు నెలల క్రితం జన్మించిన కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో, తన భర్త ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో గత నెల (డిసెంబర్ 28న) ఖానాపూర్ లోని ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఐతే తనకు చెప్పకుండా ఎందుకు హాస్పిటల్ కు తీసుకెళ్ళావు అని ఉయ్యాలలో నిద్రిస్తున్న 57 రోజుల పసికందును తన చేతుల్లోకి తీసుకుని ఒక్కసారిగా కిందకు పడేశాడు. పాపం, పై నుండి కిందకు పడగానే బాబు అస్వస్థతకు గురయ్యాడు.

మూడు రోజుల తర్వాత కన్నీరు మిగిలింది

తండ్రి చేతుల్లో నుండి నేలకు బలంగా బాలుడు తల తాకడంతో హాస్పిటల్ లో మూడు రోజుల పాటు ఉంచి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. బాబు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. దీంతో పోలీసులకు ఆ బిడ్డ తల్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. కాగా వీరికి ఒక కూతురు కలదు. క్షణికావేశంలో సొంత తండ్రే ఇలా చేయడంతో హాస్పిటల్ లో నెలల పసికందును చూసి కన్నీరు మున్నీరయ్యారు.

పిల్లలు మీ జీవితంలో ఆనందాన్ని నింపడానికి వచ్చిన వారు, కానీ సొంత తల్లితండ్రులే ఆవేశానికి గురై కన్నబిడ్డను దూరం చేసుకునేంత పాపం ఆ పిల్లలు ఏం చేశారని అందరూ ప్రశ్నిస్తున్నారు.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon