Link copied!
Sign in / Sign up
12
Shares

5 ఏళ్లకే బిడ్డకు జన్మను ఇచ్చి తల్లి అయిన పాప : చరిత్రలో ఇదే మొదటిసారి, ఎవ్వరికీ తెలియని అసలు నిజం ఇదే

ఎస్. ఇది నిజమే, ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు లీనా మెడీనా. 5 ఏళ్లకే ఒక బాబుకు జన్మను ఇచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది నమ్మడానికి కాస్త కష్టమే అయినా నిజం. అసలు ఈ చిన్నారి గర్భం దాల్చడానికి కారణం ఏంటని వైద్యులు ఎన్నో పరిశోధనలు చేసినా కానీ అసలైన కారణం కనుక్కోలేకపోయారు. అసలేం జరిగిందో మీరే చూడండి..

కడుపునొప్పి అని డాక్టర్ దగ్గరకు వెళితే..

ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారే లీనా మెడీనా. పెరూలో జన్మించిన ఈ చిన్నారి చిన్నతనంలో అందరి పిల్లల మాదిరిగానే ఉండేదట. వయస్సు పెరిగేకొద్దీ అంటే ఒక సంవత్సరం వచ్చేసరికి నెలసరి (పీరియడ్స్) రావడం మొదలయ్యాయట. ఐతే ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆ చిన్నారి కడుపు కొంచెం కొంచెంగా ముందుకు రావడంతో నొప్పిగా ఉందని అమ్మానాన్నలకు చెప్పగా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. మొదట ఇది సాధారణ కడుపునొప్పి  అని తేల్చి మందులు ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ హాస్పిటల్ కు వెళ్లగా 7 నెలల బిడ్డ ఆ పాప కడుపులో పెరుగుతున్నారు అని చెప్పారు.

తండ్రే కారణమని అరెస్ట్ చేశారు..

5 ఏళ్ళ చిన్నారి గర్భం దాల్చడంతో దీనికి కారణం తండ్రే అని అరెస్ట్ కూడా చేశారు. ఐతే అందుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో మళ్ళీ వదిలిపెట్టారు. 1939 మే 14న లీనా మెడీనా మగపిల్లాడికి జన్మను ఇచ్చింది. ఆ పిల్లాడి పేరు జరాడో. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఆ పిల్లాడికి పదేళ్ల వయస్సు వచ్చేవరకు లీనా మెడీనా తన అక్క అని అనుకున్నాడట.  కాగా, లీనాలో ఆర్గాన్ల పెరుగుదల వయసుకు మించి ఉండటమే ఇందుకు కారణమని డాక్టర్లు అన్నారు. 5 ఏళ్లకే తల్లి అయిన చిన్నారి ఈమె పేరు రికార్డుల్లో ఉంది..

ఎంత విచిత్రమో కదా.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon