Link copied!
Sign in / Sign up
39
Shares

5 ఏళ్ళ పాప ఉన్నట్లుండి కింద పడిపోయింది : పాప తలలో ఈ పురుగు చూసి షాక్ అయిన డాక్టర్స్, తల్లి..

ఉదయాన నిద్ర లేసిన కైలిన్ గ్రిఫిన్ యొక్క అడుగులు నేలను తాకగానే, తను కుప్పకూలిపోయింది.. 5 ఏళ్ళ వయసు గల ఆ అమ్మాయి, తిరిగి నిలబడటానికి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. చివరికి తను వాళ్ళ అమ్మతో మాట్లాడటానికి కూడా కష్టపడుతుండటం, వాళ్ళ అమ్మ అయిన జెస్సికా గ్రిఫిన్ గమనించారు.

ఆ ముందు రోజు రాత్రి  కైలిన్ తన కుటుంబంతో సహా టి-బాల్ అనే ఆట ఆడటానికి, ఫ్లోరిడా లోని మిడ్వే అనే ప్రాంతానికి వెళ్లినట్లుతెలిపారు. ఇందు కారణంచే, తను బాగా అలసిపోయి, తరువాతిరోజు ఉదయం నిద్రలేవగానే లేసినపుడు, కాలు చచ్చుబడి ఉండొచ్చు అని భావించారు.

కానీ, తరువాత ఆవిడ తన కూతురు కైలిన్ కు జడ వేస్తుండగా, ఆ పాప తలలో ఆవిడకు పేను కనిపించింది. ఆ పేను, పాప తలచర్మంలోకి చొచ్చుకుపోయి, రక్తంతో ఉబ్బిపోయి ఉండటాన్ని ఆవిడ గమనించారు.

వెంటనే ఆవిడ ఆ కీటకాన్ని తలనుండి తీసి ఒక ప్లాస్టిక్ సంచి లో ఉంచి, తన కూతురుని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు  గ్రిఫిన్ కు అది టిక్ పక్షవాతం అనే అసాధారణమైన స్థితి అని వివరించారు.

గ్రిఫిన్ గారు, తన కూతురుకి వచ్చిన ఈ పరిస్థితిని వివరిస్తూ, ఫేస్బుక్ లో ఇలా పోస్ట్ చేసారు, “టన్నుల కొద్దీ రక్తపరీక్షలు మరియు CT ల తరువాత UMMC అధిపతి, దీన్ని టిక్ పక్షవాతం గా నిర్దారించారు!! ఇది పెద్దలలో కంటే పిల్లలలో నే చాలా సాధారణంగా వస్తుంది!”

తన కూతురి తలలోకి ఈ పేను, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎంతసేపటినుండి అది తలలో ఉంది అనే వివరాలు ఆమెకు కచ్చితంగా తెలియనందున గ్రిఫిన్ వెంటనే ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. కాని ఈ పేన్లు, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో చాలా చురుగ్గా ఉంటాయి, అక్కడి ఆరోగ్య నిపుణులు మీడియా వాళ్ళు చెబుతున్నారు.

అక్కడ మరో మీడియా కథనం, ఈ టిక్ పక్షవాతం అనేది, గుడ్లు పెట్టే స్థితిలో ఉన్న ఆడ పేన్ల వల్ల కలుగుతుంది.. ఈ పేను, రక్తం పీల్చుకున్న తరువాత, అతిథేయ చర్మంలోకి న్యూరోటాక్సిన్ అనే విష పదార్థాన్ని వదులుతాయి.

ఈ పేలు, ఒకరి రక్తాన్ని పీల్చడం మొదలుపెట్టిన, అయిదు నుండి ఏడు రోజుల దాకా, ఎటువంటి లక్షణాలు బయటపడవు.

ఈ పక్షవాతం కాళ్లల్లో మొదలై నెమ్మదిగా తల వరకు చేరుతుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న నివేదిక ప్రకారం అలసట, తిమ్మిరి, మరియు కదలలేని స్థితి రావడం వంటి లక్షణాలను ఇది కనబరుస్తుంది.

ఇంకా తరువాతి దశల్లో దీని వల్ల ముఖానికి ఆఖరికి  నాలుకని కూడా కదల్చలేని స్థితి కలుగుతుంది. ఆపైన ఇంకా నిర్లక్ష్యం చేస్తే, ఈ విష పదార్థం వలన ఊపిరితిత్తులు కూడా చచ్చుబడి, ఊపిరి తీసుకోడం కుడా కష్టం అయ్యే ప్రమాదం ఉంది.

ఈ పేల వల్ల పక్షవాతం, సాధారణంగా జంతువుల్లో కనపడుతుంది ఎందుకంటే వాటంతట అవి పేలని తొలగించలేవు కాబట్టి.

అదేవిధంగా చిన్న పిల్లల యొక్క చిన్న శరీరాకృతి మరియు బరువు వల్ల కూడా ఈ పక్షవాతం రావడం సహజం. ఈ వ్యాధి ఎక్కువగా అమ్మాయిలో కనపడుతుంటుంది. అమ్మాయిల యొక్క దట్టమైన జుట్టు లో ఇవి కనిపించకపోవడమే దీనికి కారణం అని ఫౌండేషన్ వాళ్ళు వివరించారు.

ఇంకా ఇటువంటి అరుదైన సంఘటనలను కొన్ని CDC 2006 నివేదికలో మనం చూడవచ్చు. బాధితుల్లో ఒక 6 ఏళ్ళ అమ్మాయి ఉంది. తను లారిమెర్ దేశం లోని కొండప్రాంతాల్లో ఉండే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి నుండి తిరిగి వచ్చాక, ఒక వారం పాటు నడవలేని స్థితిలోకి వెళ్లిపోయింది. తరువాత, నర్సు ఆ పాపకి స్నానం చేయిపించేటప్పుడు, తన తల వెంట్రుకల్లో ఉండే పేలను గమనించి వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.

ఇలాగే గత ఏడాది, అమాండా లెవీస్ అనే ఆవిడ నిద్ర లేసి చూసినపుడు, తన 3 ఏళ్ళ కూతురు, ఎవిలిన్ ఎంత ప్రయత్నించినా లేవలేకపోవడాన్ని గమనించారు.

లా గ్రాండ్, ఒరెగాన్, మహిళ ఫేస్బుక్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఆ అమ్మాయి యొక్క ఆకస్మిక వింత ఇబ్బందికి కారణమవుతుందని కారణాన్ని గుర్తించడం లో వాళ్లకు సహాయపడగలరని ఆశించారు. కాని ఎవరూ వాళ్ళకి ఎటువంటి సహాయం అందించలేకపోయినా ఆ వీడియో 22 మిలియన్ సార్లు వీక్షించబడింది 600,000 కన్నా ఎక్కువసార్లు పంచుకోబడింది.

ఆ రోజు, జాన్ పేజ్ అనే వైద్యులు, ఆ 3 ఏళ్ళ పాప యొక్క అస్థిరతను పరీక్షించి, తన తల గీకిన తరువాత బయటపడ్డ పేను కారణంగా, అది టిక్ పక్షవాతం గా నిర్దారించారు.మరియు అది తొలగించిన తరువాతి రోజు నుండి, ఎవిలిన్ ఎప్పటిలాగే నడవడం మొదలు పెట్టింది.

అచ్చం ఇలాగే మిస్సిసిపీ లోని కైలీన్ గ్రిఫిన్ కూడా త్వరగా కోలుకునింది.

గ్రిఫిన్ తన పాప బెలూన్లు పట్టుకొని నడుస్తున్న దృశ్యాన్ని ఫేస్బుక్ లో అందరితో పంచుకొని తన ఆనందం వ్యక్తం చేసింది  మరియు భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకొనింది.

Image Source : Jessica Griffin

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon