Link copied!
Sign in / Sign up
5
Shares

మీ ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే ‘డబ్బు’ అస్సలు నిలవదు : వెంటనే బయట పడేయండి

మనమందరం సాంప్రదాయాలు, మన పద్ధతులు మరియు విలువలను ఫాలో అవుతూ ఉంటాం. అందులో వాస్తు ఒకటి. ఇంటి నిర్మాణం దగ్గరి నుండి ఇంట్లో ఉంచుకోవాల్సిన వస్తువులు, ఉంచకూడని వస్తువులు, పూజ గది ఎక్కడ ఉండాలి..ఇలా ప్రతి ఒక్క విషయాల గురించి ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాం. ఐతే ఇక్కడ చెప్పుకునే ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండటం వలన లక్ష్మీదేవి దూరమవుతుందని, కొత్త కొత్త సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. అవేంటో మీరే చూడండి..

విరిగిపోయిన వస్తువులు

చాలామంది ఇళ్లలో విరిగిపోయిన కుర్చీలు, చెక్కలు, వాకిళ్లు, కిటికీలను రిపేర్ చేయించుకోకుండా లేదా బయటపడవేయకుండా ఉండటం వలన ఇంటికి మంచిది కాదని, ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు వాస్తు పండితులు. అలాగే ఫ్లవర్ వాజ్, పగిలిపోయిన అద్దాలను కూడా ఇంట్లో ఉంచుకోకూడదట.

ఫోటోలు

మీ ఇంట్లో లేదా బెడ్ రూమ్ లో పిల్లలు ఏడుస్తున్న ఫోటోలు, రామాయణ, మహాభారత యుద్ధ ఫోటోలను పెట్టుకోవడం వలన మనశ్శాంతి ఉండదని, తద్వారా లేనిపోని సమస్యలు ఎదురై మీ ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు రావడానికి కారణమవుతాయి. వీటికి బదులుగా పిల్లలు నవ్వుతూ ఉన్న ఫోటోలు ఉంచుకోవచ్చు.

చెప్పులు

అందరూ అని కాదుగానీ కొంతమంది తమ చెప్పులు, షూలను పడుకునే బెడ్ రూమ్ లో రావడం మంచం కిందనే వాటిని ఉంచడం వలన దరిద్రం అని చెబుతున్నారు వాస్తు అనుభవజ్ఞులు. ఇలా చేయడం వలన ఆరోగ్య సమస్యలు మరియు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతాయట.

మొక్కలు, జంతువులు

మీ ఇంటి ఆవరణలో లేదా ఇంట్లో బ్రహ్మజెముడు మొక్కలు ఉంచడం అస్సలు మంచిది కాదట. ఇవి అశాంతికి దారితీస్తాయని చెబుతున్నారు. అలాగే ఎండిపోయిన మొక్కలు, పూలు, పండ్లు లేని చెట్ల ఫోటోలు, క్రూరమైన జంతువుల ఫోటోలు అస్సలు పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకోవడం వలన మనస్సుకు ప్రశాంతత కరువై లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇవి అస్సలు ఉంచకూడదు

 

 

కొందరి ఇళ్లలో నెగటివిటీని, బాధను తెలిపే ఫోటోలు ఉంటాయి. అంటే ప్రేమలో విఫలమైన అమ్మాయి లేదా అబ్బాయి ఏడుస్తూ ఉండటం, ఒంటరిగా ఎక్కడికో బాధతో వెళ్తున్నట్లు, హృదయాన్ని కలిచివేసే పెయింటింగ్స్, ఇబ్బందికరం అనిపించే పెయింటింగ్స్,  చిత్రాలు మీకు ప్రశాంతత లేకుండా ఆర్ధిక ఇబ్బందులను కలిగిస్తాయి.

మీ ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకుంటే మంచిదో నెక్స్ట్ ఆర్టికల్ లో తెలుసుకుందాం, ఇది మీకు నచ్చితే వెంటనే SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon