Link copied!
Sign in / Sign up
11
Shares

పెళ్లి రోజు మీ ఆయనకు ఇవ్వాల్సిన 5 ప్రత్యేక బహుమతులు!!

ప్రతి మనిషి జీవితం లో పెళ్లి అనేది చాలా ప్రత్యేక మైనది. ముఖ్యంగా ప్రతి మహిళ కి. పెళ్లి తర్వాత తన ఇల్లు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది, తన భర్తే తన  సర్వస్వం లా భావిస్తుంది . ఒక రకంగా చెప్పాలి అంటే పెళ్లి అనేది తనకి పునర్జన్మ లాంటిది. అలంటి రోజుని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం చాల గొప్పగా వేడుక చేసుకోవాలి అనుకుంటాము , భర్తకి మంచి కానుక కొనివ్వాలి అనుకుంటాము. కానీ ఎలాంటి కానుక ఇవ్వాలి?

జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తికి ఇచ్చే కానుక చాల ప్రత్యేకమైనదిగా, మన ప్రేమ తెలిసేలా ఉండాలి.  మీ భర్తకి చాలా మంది కానుకలు  ఇవ్వచ్చు, కానీ మీరు ఇచ్చే కానుక చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. క్రింద చెప్పిన 5 కానుక లు మీ భర్త ని సంతోష పెట్టడమే కాకుండా , మీ ప్రేమను కూడా తెలియజేస్తాయి.

జ్ఞాపకాలు - చిరకాల ఆస్తులు

 

మీ వివాహ జీవితం లో ఎన్నో మధుర క్షణాలు ఉంటాయి. వాటిని గుర్తు చేస్తూ ఒక ఫోటో ఆల్బం తయారు చేయండి. ప్రతి ఫోటో పక్కన మీ భర్త మీకు ఎంత స్పెషల్ లో రాయండి. కావాలంటే మీ ఫోటోలు ఎవరికైనా ఇచ్చి, మీ భావాలు రాసి, దాన్ని అందంగా తయారు చేసి ఇవ్వమని చెప్పండి. తనంటే మీకు ఎంత ప్రత్యేకమో తెలుసుకుని చాల సంతోష పడతాడు. ఎందుకంటే, చివరకు మిగేలేది బంధాలు , జ్ఞాపకాలు మాత్రమే. తీపి జ్ఞాపకాలని గుర్తుచేసి మీ పెళ్లి రోజుని మరో మధుర జ్ఞాపకంగా మార్చండి .

చేతి గడియారం - మిమల్ని గుర్తు చేసే అలారం

 

మగ వారి జీవితం లో చేతి గడియారం చాలా ప్రత్యకమైనది . దాన్ని కానుకగా ఇవ్వడంతో మీరు తనకి సమయం తెలిసేలా చెయ్యడమే కాదు దాన్ని చూసిన ప్రతి సారి మిమల్ని మీరు గుర్తు చేయొచ్చు. ఒక మంచి గడియారం కొని దాన్ని అలంకరించి ఇవ్వచ్చును.

ఇష్టమైన వస్తువు - తన ఇష్టమే మీ ఇష్టం - మీ ఇష్టమే తన ఇష్టం

మీ భర్త ఎపుడైనా మీతో తనకి ఏదేనా వస్తువు అంటే ఇష్టము అని చెప్పి కానీ దాన్ని ఏ కారణం చేతనైన కొనలేకపోయారా? గుర్తు చేసుకోండి, అలంటి వస్తువు కొన్నివండి . ఉదాహరణకి స్పీకర్స్, షూస్ లాంటివి. ఇలాంటి కానుక చూడగానే తాను కచ్చితంగా ఆశ్చర్యం చెందుతాడు. మీరు తన ఇష్టాలను గుర్తు పెట్టుకునందుకు, గౌరవించినందుకు చాలా సంతోషపడతాడు.

విహారయాత్ర - విశ్రాంతి

 

పని, డబ్బులు, అప్పులు ఇలా చాలా సమస్యలతో రోజు సతమతమౌతుంటాం. మీరు మీ భర్తకి కొనాలనుకున్న డబ్బుతో ఒక మంచి ప్రదేశానికి వెళ్ళండి. దైనందిన జీవితం నుండి విముక్తి వస్తుంది, విశ్రాంతి దొరుకుతుంది మరియు మీరు సరదాగా గడపడానికి సమయము ఉంటుంది.

కూలింగ్ గ్లాస్సెస్

పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న వాతావరణ పరిస్థితులు ఇంటి నుండి బయటికి వెళ్లాలంటే చాలా ఇబ్బందిపరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూలింగ్ గ్లాస్సెస్ ఇవ్వడం చాలా ఉపయోగకరం. ఇది పైన చెప్పిన పరిస్థితులని ఎదుర్కోవడమే కాకుండా మీ భర్త అందంగా కనపడటానికి కూడా దోహద పడుతుంది. . ఈ వెబ్సైటులో కాన్పు, న్యూట్రిషన్, అందం వంటి వాటి మీద సలహాలు, సూచలు ఉంటాయి.

ఇవే కాకుండా మీ భర్త కు పెట్స్ ఇష్టం ఉంటే  ఒక చిన్న కుక్క పిల్లను కుడా కానుకగా ఇవ్వొచ్చును. ఇలాంటి మరెన్నో సలహాల కోసం www.tinystep.in వెబ్సైటును చుడండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon