Link copied!
Sign in / Sign up
13
Shares

భర్తను భార్యలు ముద్దుగా ఈ 5 రకాలుగా పిలుస్తున్నారు : మరి మీరెలా పిలుస్తున్నారో చెక్ చేసుకోండి

భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. ఈ బంధంలో ఎన్నో గొడవలు, చికాకులు, అలకలు, ఆప్యాయతలు, అనురాగాలు, ముద్దుమురిపాలు, సిగ్గు, భయం.. ఇలా ఎన్ని ఉన్నా సరే, దాంపత్య బంధం కాబట్టి మళ్ళీ కలవడానికి, మాట్లాడుకోవడానికి చాలా ఎక్కువ టైం పట్టదు కూడా. అయితే ఇక్కడ చెప్పుకునేట్లు భర్తను భార్యలు ముద్దుగా ప్రేమగా ఈ 5 రకాలుగా పిలుస్తున్నారు. మరి మీరు కూడా మీ భర్తను ఎలా పిలుస్తారో ఇది చదివాక COMMENT చేయడం మర్చిపోకండి..

ఏమండోయ్

సాధారణంగా పెళ్లి తర్వాత భర్తను పిలవడానికి, భర్త కళ్ళలోకి చూడటానికి మహిళలు కాస్త ఇబ్బందిగా, సిగ్గుగా ఫీలవుతూ ఉంటారు. రోజులు గడిచే కొద్దీ భర్తతో ఏర్పడిన చనువు కారణంగా ఏమండి, ఏమండోయ్, ఏమోయ్ అని గౌరవంగా పిలుస్తారు. ఇలా పిలిపించుకోవడం చాలా గర్వంగా మరియు ఆనందంగా ఉంటుంది.

శ్రీవారు

నిజంగా ఇలా పిలిపించుకోవడం అంటే అంత సులువు కాదు. గుండెల్లో ప్రేమ, గౌరవం, భార్య భర్తకు ఇవ్వాల్సిన మర్యాద ఇవన్నీ కలగలిపితేనే శ్రీవారు అనే మాట వస్తుంది. అంటే మిగతావాళ్లకు ప్రేమ, గౌరవం, మర్యాద లేవని కాదు గానీ శ్రీవారు అనే మాట మాత్రం గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. మావారు, మా శ్రీవారు అని అంటుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కదా.

బావ/మామ

అత్త కూతురుని, వరుసకు మరదలు అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే బావ, మామ అని పిలవక్కర్లేదు. మనవాళ్ళు పెళ్లి తర్వాత కూడా బావ లేదా మామ అని భర్తను ఎంతో ముద్దుగా ప్రేమగా పిలుస్తున్నారు. ఇలా పిలుస్తుంటే ఒకరిపై మరొకరికి ఎంత ప్రేమ ఉందో బాగా చెప్పవచ్చట. అలాగే ఇద్దరు బాగా అర్థం చేసుకుంటారని, కష్టాలలో సైతం బావకు అండగా నిలబడుతుందని చెబుతున్నారు.

పెనిమిటి

కొన్ని కొన్ని ఏరియాలలో ఇలా తమ భర్తను మహిళలు పిలవడం జరుగుతోంది. ఇంటికి రాగానే పెనిమిటి కాళ్ళు కడుక్కుంటారా, పెనిమిటి రా భోజనం చేద్దువు అంటూ ప్రేమగా పిలుస్తుంటారు. తన భర్త రిప్లై కోసం ఎంతగానో ఎదురుచూస్తూ నేలకు వంచిన పైకి ఎత్తకుండా ఉంటారు.

పేర్లతో..

వాస్తవానికి హిందూ సాంప్రదాయ పెళ్లిళ్ల ప్రకారం, వివాహ పద్ధతుల ప్రకారం భర్తన భార్య పేరు పెట్టి పిలవకూడదు అని అంటారు. ఇలా పిలవడం వలన భర్తకు తగిన మర్యాద ఇవ్వట్లేదని అనుకుంటారని చెబుతారు. కానీ ఇప్పుడు అందరూ అలా ఏమీ ఫాలో అవ్వటం లేదు కదా.  పేరు పెట్టి పిలిచినా అందులో ప్రేమ మరియు గౌరవం ఉన్నాయని చెబుతున్నారు.

ఎలా పిలిచినా సరే ఇద్దరు అర్థం చేసుకోవాలి, అన్యోన్యంగా ఉండాలనే మేం కోరుకుంటున్నాం.  మరి మీరు మీ భర్తను ఎలా పిలుస్తారో COMMENT చేయడం మర్చిపోకండి…  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon