Link copied!
Sign in / Sign up
0
Shares

సమ్మర్ లో ప్రేగ్నన్ట్ అవ్వడం మంచిదేనా..? ఈ 5 విషయాలు వెంటనే తెలుసుకోండి

మహిళలకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే విషయం ఏదైనా ఉందంటే గర్భం దాల్చడం మరియు తల్లి కావడం. బహుశా దీనికంటే గొప్ప ఆనందాన్ని వారికి మరేదీ ఇవ్వదేమో కదా. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి, ఈ టైంలో గర్భం దాల్చితే ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, ఒకవేళ గర్భం దాల్చితే అందుకు ఉపయోగపడే విషయాలు ఇక్కడ తెలుసుకోండి. ఇంకో విషయం ఏమిటంటే వింటర్ లో కన్నా సమ్మర్ లో ప్రేగ్నన్ట్ అవ్వడం వలన ఎక్కువ ప్రయోజనాలు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో మీరే చూడండి..

మార్నింగ్ వాక్

ఉదయాన్నే నిద్ర లేచి జాగింగ్ లేదా మార్నింగ్ వాక్ చేయడం వలన ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఐతే చలికాలంలో ఇలా నిద్రలేచి నడవటం చాలా కష్టం మరియు చల్లగా వీచే గాలులు, మంచు కురుస్తుండటం వలన వచ్చే అనారోగ్య సమస్యలు ఇలా చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అదే సమ్మర్ లో ఐతే అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టి మార్నింగ్ వాక్ బాగా ఉపయోగపడుతుంది.

విటమిన్ D

ఎస్, విటమిన్ డి మీ శరీరానికి తగలడం వలన మీ ఎముకలు దృఢంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలాగే మీ శరీరానికి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా విటమిన్ డి వలన దూరం అవ్వచ్చు. ఎక్కువ నడవలేని వాళ్ళు ఇంటి బయట కొద్దిసేపు సూర్యుడి కిరణాలు తగిలేలా నిల్చుంటే చాలు మీ శరీరానికి సరిపడ విటమిన్ డి అందుతుంది.

మీరు ధరించే బట్టలు

చలికాలంలో ఎక్కువ చలి తగులుతుంది కాబట్టి మీ శరీరానికి వేడి కలిగించే దుస్తులు చాలా అవసరం. అదే వేసివిలో అయితే ఎండ వేడిమి కారణంగా చమటలు ఎక్కువ ఉంటాయి, బాడీ హీట్ ఉంటుంది. అందుకని మీ శరీరానికి సౌకర్యవంతమైన పలుచటి దుస్తులు, గాలి తగిలే దుస్తులను ఎటువంటి ఇబ్బంది లేకుండా ధరించవచ్చు. సమ్మర్ లో ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు.

సమ్మర్ లో ఇదే బెస్ట్..

సాధారణంగా గర్భంతో ఉన్నప్పుడు కొందరు నీటిని తక్కువగా తీసుకుంటూ ఉంటారు. అదే సమ్మర్ లో గర్భం దాల్చడం వలన ఒకరు చెప్పాల్సిన అవసరం లేకుండానే ఎక్కువ నీటిని సేవించడం, శక్తిని బలాన్ని ఇచ్చే సహజమైన జ్యూస్ లు సేవించడం చేస్తారు. ఇలా చేయడం వలన మీతో పాటు మీ కడుపులోని బిడ్డకు కూడా మంచిదే. సమ్మర్ లో డీ హైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి.

ఫ్రూట్స్

సమ్మర్ లో చాలావరకు అందరూ ఇష్టపడే ఫ్రూట్స్ మామిడి పండ్లు. వీటిని ఎక్కువగా పండుగా కాకుండా గర్భిణీ మహిళలు జ్యూస్ గా సేవించడం చాలా మంచిది. మరీ ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇవి వేడిని కలిగిస్తాయి కూడా. కేవలం మామిడిపండ్లే కాకుండా సమ్మర్ లో ఎక్కువ మోతాదులో పండ్లను తీసుకోవడం మంచిది.

సమ్మర్ లో గర్భం దాల్చాలి అనుకున్న మహిళలకు, ప్రేగ్నన్ట్ అయిన వారికి ఈ విషయాలు తెలియజేయండి. మీరు చెప్పే ఈ చిన్న విషయాలు వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి కూడా. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon