Link copied!
Sign in / Sign up
10
Shares

46 ఏళ్ళు బిడ్డను కడుపులో ఉంచుకున్న తల్లి, ఇప్పుడు ఆ బిడ్డ ఎలా ఉన్నాడో చూడండి

ఒక బిడ్డకు జన్మను ఇవ్వడంతో మహిళకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుందని అంటారు. నవమాసాలు బిడ్డను కడుపులో మోసి, ప్రాణాలు లెక్కచేయకుండా బిడ్డకు జన్మను ఇవ్వడంలో ఆనందాన్ని పొందే అమ్మలందరికీ బిడ్డలు ఎప్పటికీ తీర్చుకోలేని రుణం. అయితే ఇక్కడ చెప్పుకోబేయే అమ్మ మాత్రం 9 నెలలు కాదు, ఏకంగా తన కడుపులో 46 ఏళ్లుగా బిడ్డను మోసింది. అసలేం జరిగిందే తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.

నెలలు నిండటంతో హాస్పిటల్ కు వెళ్ళింది

ఇక్కడ చెప్పుకుంటున్న సంఘటన ఇప్పటిది కాకపోయినా, ఈ మాతృమూర్తి గురించి అందరికీ తెలియాలని చెబుతున్నాం. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు జహ్రా అబౌతాలిబ్. నెలలు నిండి పురిటి నొప్పులు రావడంతో స్థానిక హాస్పిటల్ కు వెళ్ళింది. కొన్ని గంటల తర్వాత బిడ్డకు జన్మను ఇవ్వకుండా బయటకు వచ్చింది. ఎందుకంటే తన కళ్ళముందే బిడ్డకు జన్మను ఇస్తున్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వలన. తనకు, తన బిడ్డకు ఇలాగే జరుగుతుందని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా ఏమీ కాదని డాక్టర్లు చెప్పినా వినలేదు. తన బిడ్డే గర్భం నుండి బయటకు రావాలని, నేను ప్రసవించలేనని మనస్సులో గట్టిగా నిర్ణయం తీసుకుంది. కానీ కడుపులో బిడ్డ చనిపోయింది. తనకి పిల్లలు లేకపోవడంతో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని సంతోషంగా జీవస్తూ వచ్చింది.

కడుపు నొప్పి రావడంతో అసలు విషయం తెలిసింది

ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని సంతోషంగా జీవనం సాగిస్తున్న జహ్రా అబౌతాలిబ్ వయస్సు మీద పడే కొద్దీ ముసలితనం వచ్చేసింది. దాదాపు 46 ఏళ్ళ తర్వాత కడుపు గట్టిగా ఉబ్బి, నొప్పి రావడంతో ఆమె కొడుకు హాస్పిటల్ కు తీసుకెళ్లగా స్కాన్ చేసి చూశారు. కడుపులో రాతి ఆకారంలో ఉన్న పిండం గమనించి ఆశ్చర్యపోయారు. అప్పటికీ ఆమె భయపడటంతో నచ్చచెప్పి ఆపరేషన్ చేసి చనిపోయిన బిడ్డను బయటకు తీసి వారి ఆనవాయితీ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారట. కాగా, ఆమె తన కడుపులో ఒక బిడ్డ ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయారట. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే సంఘటనే కదా.

బిడ్డకు జన్మను ఇవ్వడం మహిళకు దక్కిన గొప్ప అదృష్టం. కాబట్టి, మహిళలు భయపడకండి.. అప్పుడంటే సరైన విధంగా వైద్య సౌకర్యాలు అంతగా లేవు. కానీ ఇప్పుడు అలా కాదు కదా..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon