Link copied!
Sign in / Sign up
11
Shares

450 గ్రాముల బరువుతో పుట్టిన ‘మిరాకిల్ బేబీ’ : ఇండియాలో ఇదే రికార్డ్, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

పుట్టే పిల్లలు దాదాపు 2 లేదా 2.5 కిలోల బరువుతో జన్మిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఇక్కడ చెప్పుకునే బిడ్డ అతి తక్కువ బరువు కేవలం 450 గ్రాముల బరువుతో జన్మించింది. ఇప్పటివరకు మనదేశంలో ఇంత తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ. అంతకుముందు 495 గ్రాముల బరువుతో పుట్టిన బిడ్డ రికార్డ్ గా ఉండేది. అయితే 3 నెలల తర్వాత ఈ పాప జీవితంలో జరిగిన మిరాకిల్ చూడండి…

డాక్టర్లు బ్రతకదని చెప్పారు

చండీఘర్ లో రజిని అనే ఆమెకు నాల్గవసారి గర్భం దాల్చినప్పుడు పుట్టిన మిరాకిల్ బేబీ ఈ చిన్నారి. అంతకుముందు మూడుసార్లు మిస్ క్యారేజ్ జరిగిందట. పుట్టగానే బిడ్డను చాలా తక్కువ బరువుందని చూశారు. కేవలం 450 గ్రాముల బరువే ఉంది, బ్రతకడం కష్టమే అని తేల్చిచెప్పారు. ఏమైనా సరే మా బిడ్డను బ్రతికించడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేయండని ఆ పాప తల్లితండ్రులు డాక్టర్లను వేడుకున్నారు. తమ ప్రయత్నంగా ఐసీయూలో ఉంచి, ఇంక్యుబేటర్ అరేంజ్ చేశారు. ఆ చిన్నారికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. ఊపిరి అందేలా చేశారు వైద్యులు.

3 నెలల తర్వాత షాక్ అయిన డాక్టర్లు

డాక్టర్లు చెప్పింది తప్పు, నేను మీకు ఆనందాన్ని పంచడానికి వచ్చాను అని తెలిపేలా 10 వారాల తర్వాత బిడ్డ 1.5 కేజీల బరువు పెరిగింది. ఇప్పుడు చలాకీగా ఉంది. స్పూన్ తో పాలు పట్టిస్తే బాగా తాగుతోంది కూడా. అస్సలు బ్రతకడం కష్టం అని చెప్పిన డాక్టర్లు, ఆ చిన్నారి ఎంతో ఆరోగ్యంగా బరువు పెరగటం చూసిఆశ్చర్యపోయారు. చాలా తక్కువ బరువుతో పుట్టిన ఈ చిన్నారి ప్రాణాలతో బ్రతికిన బిడ్డగా మనదేశంలో రికార్డ్ సృష్టించిందని అన్నారు.

పిల్లలు తక్కువ బరువుతో పుట్టడానికి గర్భంతో ఉన్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఒక కారణమే అని అంటున్నారు వైద్యులు. అందుకే జాగ్రత్తగా ఉండండి, పుట్టబోయే పిల్లలకు గొప్ప జీవితాన్ని ఇవ్వండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon