Link copied!
Sign in / Sign up
0
Shares

4 నెలల గర్భవతిని కర్కశంగా కాలితో తన్నాడు : భర్తను కాపాడబోతే బిడ్డ చనిపోయింది..!!

మరో కొన్ని నెలలలో తమ ఇంట్లో చిరునవ్వును తీసుకువచ్చే బిడ్డ రాబోతున్నాడని అందమైన కలలు కన్నారు. కానీ, చిన్న గొడవ వారి ఆనందాలను చిన్నాభిన్నం చేసింది. 4 నెలల గర్భవతి అని కూడా చూడకూండా కర్కశంగా కడుపుపై తన్నడంతో కడుపులోని బిడ్డ చనిపోయింది. వైద్యులు అబార్షన్ చేయగా, తన కడుపులోని బిడ్డను చంపిన వారికి శిక్ష పడాలని ఆ తల్లి న్యాయ పోరాటం చేస్తోంది.

అసలేం జరిగిందంటే…

అమ్మతనాన్ని అవమానించేలా అందరినీ బాధిస్తున్న ఈ సంఘటన కేరళలోని కోజికోడ్ లో జరిగింది. 30 ఏళ్ళ వయస్సులో ఉన్న మహిళ 4 నెలల గర్భవతి. తమ ఇంటి పక్కనే ఉన్న వ్యక్తికి, తన భర్తకు ఏదో గొడవ జరగడంతో అది కుటుంబం మీదకు వచ్చింది. తన భర్తను కొట్టడానికి ఇంకొక వ్యక్తితో కలిసి తమ ఇంటి పక్కనే ఉన్న అతను రావడంతో గొడవను ఆపివేయడానికి ప్రయత్నం చేసింది. ఇలా ఆపబోతుంటే ఒకతను ఆమె కడుపుపై కాలితో తన్నాడు. గర్భవతి కావడంతో దెబ్బ బాగా తగిలి రక్తస్రావం అయి కిందపడిపోయింది. హాస్పిటల్ కు తీసుకెళ్లగా కడుపులోని బిడ్డ చనిపోయిందని చెప్పారు.

కారును తాకిందనే కారణంతో తన్నాడు

తన కడుపుపై కాలితో తన్నిన అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతను ఓ పొలిటికల్ పార్టీకి చెందినవాడు కావడంతో అతడి అనుచరులు ఆమె ఇంటికి వెళ్లి బెదిరించారట. కేసు వెనక్కి తీసుకోకపోతే చంపివేస్తామని ఇంటిపై దాడి చేశారట. ఈ విషయాన్ని మళ్ళీ పోలీసులకు తెలిపి, నాకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తానని ఆమె అన్నారు. ఇద్దరిలో ఒక వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, పొలిటికల్ పార్టీకి చెందిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతడి కారును ఆమె తాకింది అనే ఒకే ఒక్క కారణంతోనే ఆమె కడుపుతో తన్నారని అంటున్నారు.

ఎన్ని గొడవలున్నా మహిళ అని చూడకుండా, అందులో గర్భంతో ఉన్న మహిళపై ఇలా కాళ్లతో దాడి చేయడం సిగ్గు చేటు. వారికి న్యాయం కలగాలని అందరూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon