3వ నెల ప్రెగ్నన్సీతో ఉన్నపుడు తినకూడని 5 ప్రమాదకరమైన ఆహారాలు

ప్రెగ్నన్సీ తో ఉన్నపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. మీరు ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం, మీతో పాటు మీ కడుపులో బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఆహారం. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం ప్రమాదకరం? ఈ ప్రశ్నలు ప్రెగ్నన్సీ మొదలైనప్పటినుంచి మనస్సులో మెదులుతూనే ఉంటాయి. అందుకే 3వ నెలలో ఎలాంటి ఆహారాలు మీకు ప్రమాదమో తెలుసుకోండి....
1.కెఫైన్ ఉన్న పానీయాలు
ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు శరీరానికి ఐరన్ చాలా అవసరం. మీ శరీరంలో ఐరన్ పెరుగుతూ ఉండాలి. కానీ కెఫైన్ శరీరానికి, మీరు తిన్న ఆహారం నుంచి ఐరన్ అందకుండా అడ్డుకుంటుంది. అందుకే ప్రెగ్నన్సీ తో ఉన్నపుడు కాఫీ లేదా కెఫైన్ తో కూడిన ఏ విధమైన పానీయాలు తీసుకోవడం పూర్తిగా మానేయండి.
2.బొప్పాయి
ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు తినకూడని అత్యంత ప్రమాదకరమైన వాటిలో ‘బొప్పాయి’ ఒకటి. బొప్పాయిలో లేటెక్స్ (latex) అనే హానికర పదార్ధం ఉంటుంది. ఇది ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు గర్భస్రావం (abortion), లేదా నెలలు తక్కువ కాన్పు జరగడానికి కారణం అవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నన్సీ తో ఉన్నపుడు బొప్పాయి తినకండి.
3.కొన్ని రకాల చేపలు
కొన్ని రకాల చేపల్లో మెర్క్యూరీ (mercury) అధికంగా ఉంటుంది. ఈ మెర్క్యూరీ కడుపులోని శిశువు ఎదుగుదలను అడ్డుకుంటుంది. అందుకే ప్రెగ్నన్సీ తో ఉన్నపుడు, మీరు మాములుగా తినే కొన్ని రకాల చేపలకు దూరంగా ఉండండి. ప్రెగ్నన్సీ తో ఉన్నపుడు ట్యూనా (tuna) చేప తినచ్చు. అయితే బాగా ఉడికేలా చూసుకోండి.
4.డీప్ ఫ్రైస్, జంక్ ఫుడ్స్
ప్రెగ్నన్సీ తో ఉన్నపుడు అన్ని రకాల ఆహారాలు తినేయాలనిపిస్తుంది. కొంతమంది జంక్ ఫుడ్ తినాలనుకుంటారు. మీకు ఎంత తినాలని కోరిక ఉన్నా జంక్ ఫుడ్, డీప్ ఫ్రైస్ తినకండి. వాటి వలన అరుగుదల, కడుపులో గ్యాస్ పెరగడం లాంటి సమస్యలు వస్తాయి.
5.ప్యాకేజ్డ్ ఫుడ్ (packaged food)
మార్కెట్ లో దొరికే వండిన చికెన్ లేదా ఏదైనా ప్యాకేజ్డ్ ఫుడ్ , ప్రెగ్నన్సీతో ఉన్నపుడు ఇవి అసలు తినకండి. ఈ ఆహారపదార్ధాలు పాడైపోకుండా ఉండడానికి, వీటిని తయారుచేసేటప్పుడు,వీటిలో కొన్ని రకాల కెమికల్స్ వాడుతారు. అవి మీకు ప్రమాదకరం. ప్రెగ్నన్సీతో ఉన్నపుడు ఇంట్లో చేసినవి మాత్రమే తినండి.