Link copied!
Sign in / Sign up
4
Shares

31 రోజుల పాప ప్రాణాలను కాపాడి మానవత్వం చాటుకున్న డ్రైవర్

31 రోజుల బిడ్డ, హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. 8 గంటల్లో మరో హాస్పిటల్ కు తీసుకెళ్లి ఈ చిన్నారికి హార్ట్ సర్జరీ చేస్తే పాపను ప్రాణాలతో కాపాడుకోవచ్చు. కానీ వీరు ఉన్న చోటు నుండి ఇంకో హాస్పిటల్ కు చేరడానికి దాదాపు 500 కి.మీ దూరం, 14 గంటలైనా పడుతుంది. కానీ కేవలం 7 గంటల్లో 500 కి.మీ ను ప్రయాణించి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించాడు అంబులెన్స్ డ్రైవర్. మానవత్వం చాటుకున్న ఈ గొప్ప విషయాన్ని అందరికీ SHARE చేయండి.

పాప ప్రాణాలు కాపాడటానికి..

ఇది దాదాపు 3 నెలల క్రితం జరిగిన సంఘటన అయినా ఆ వ్యక్తి గురించి ప్రపంచానికి చాలా తక్కువే తెలుసు. ఆయన చేసిన గొప్ప పని మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. 31 రోజుల ఈ చిన్నారి కేరళలోని కన్నూరులో గల మెడికల్ కాలేజ్ లో శస్త్రచికిత్స చేస్తున్నారు. ఐతే హార్ట్ సర్జరీ చేయడానికి 500 కి.మీ దూరంలో గల తిరువనంతపురం వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళడానికి దాదాపు 14 గంటలు పడుతుంది. కానీ పాప ప్రాణాలతో బ్రతకాలంటే 8 గంటల్లో అక్కడికి తీసుకువెళ్లాలి.

రికార్డ్ కోసం కాదు..పాపను బ్రతికించాలని

31 రోజుల ఫాతిమాను కాపాడటానికి పోలీసులు, సామజిక కార్యకర్తలు, ఇంకా కొంతమంది అధికారుల సహాయంతో ఎటువంటి ట్రాఫిక్ లేకుండా కేవలం 7 గంటల్లో అక్కడికి చేర్చాడు. హార్ట్ సర్జరీ విజయవంతం అయ్యింది. నిజానికి 500 కి.మీ లను 7 గంటల్లో చేరుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. ఎంతో టెన్షన్, కళ్ళు మూతపడుతున్నా ఇంత రిస్క్ చేసినందుకు నిజంగా ఈ అంబులెన్స్ డ్రైవర్ ను అభినందించాల్సిందే. ఇదంతా నేను రికార్డ్ కోసం చేయలేదని పాప ప్రాణాలను కాపాడటానికే ఇలా చేశానని చెప్పాడు.

ఇలాంటి గొప్ప వ్యక్తులను ప్రభుత్వం వారు చేసిన గొప్ప పనికి తగిన గుర్తింపు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా… 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon