Link copied!
Sign in / Sign up
20
Shares

20 ఏళ్ళు నిండిన అబ్బాయిలు, అమ్మాయిలు మాత్రమే ఇది తెలుసుకుంటే బాగుంటుంది..

అమ్మాయిలు అబ్బాయిలలో ఏం చూసి ఇష్టపడతారు? ఒక అబ్బాయిని తమ జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉండాలనుకుంటారు? నేను చాలా అందంగా ఉంటాను, కానీ నన్ను ఎవరూ ప్రేమించడం లేదు, ఏ అమ్మాయికి నేను నచ్చడం లేదని కొంతమంది అబ్బాయిలు ఫీలవుతూ ఉంటారు. అసలు అమ్మాయిలకు ఎటువంటి అబ్బాయిలంటే ఇష్టమో ఇక్కడ చూడండి. ఇది చిన్నవాళ్లు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టే 20 ఏళ్ళు నిండిన వయస్సు లేదా టీనేజ్ దాటిన వారు చూడాలని చెప్పాము…

స్మైల్, హాస్యం

ఎస్..ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అమ్మాయిలకు ఎప్పుడు నవ్వుతు నవ్విస్తూ ఉండే అబ్బాయిలంటే చాలా ఇష్టమట. తమ జీవిత భాగస్వామి కూడా నవ్వించేవాడు, సంతోషంగా చూసుకునే వాడైతే బాగుంటుందని మహిళలు ఎక్కువగా కోరుకుంటారు. అమ్మాయిలు త్వరగా బాధపడతారు, అందరితో వెంటనే కలిసిపోవడానికి చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. అందుకని అబ్బాయిలే చనువుగా మాట్లాడి నవ్వించడం, చిరునవ్వు చిందించడం వలన నా అనే ఫీలింగ్ వారిలో కలుగుతుంది.

ధైర్యం కలిగిన వ్యక్తి

సమస్య ఎదురైనప్పుడు దూరంగా పరిగెత్తే పిరికితనమైన మగవాళ్ళంటే మహిళలకు అస్సలు ఇష్టం ఉండదు. ఇలా భయపడేవాడు నన్ను ఎలా ప్రేమగా చూసుకుంటాడని అనుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా ఉండి ఇబ్బందుల్లో కూడా పోరాటం చేసేవాడిని అమ్మాయిలు ఇష్టపడతారు.

కళ్ళు

అమ్మాయిలు అబ్బాయిలు చూసే విధానాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. వీడి చూపులో ఏదో తేడా ఉందని వారికి ఇట్టే తెలిసిపోతుంది. అందుకే అమ్మాయిలతో ఉన్నప్పుడు లేదా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వారిని భయపెట్టేలా కాకుండా మీ కళ్ళతో ప్రేమను చూపించండి, నీకోసమే ఈ జన్మ అనేలా ఆ అమ్మాయికి మీ కళ్ళతోనే సమాధానం ఇవ్వాలి. మగవారిలోనే కాదు అమ్మాయిలు చూసే చూపుకి అబ్బాయిలు ఆకర్షితులవుతారు.

అర్థం చేసుకునేవాళ్ళు

ఇది ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి నుండి కోరుకునే విషయం. అర్థం చేసుకునేవాడు నా జీవితంలో వస్తే బాగుంటుందని పదే పదే అంటుంటారు. నాకు ఏం కావాలో తెలుసుకోవాలి, నా ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి, నన్ను ప్రేమగా చూసుకోవాలి, నేను చెప్పలేని విషయాలను కూడా అతను అర్థం చేసుకోవాలని అనుకుంటారు. ఇది అబ్బాయిలకు కష్టమే కావచ్చు, కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే అమ్మాయిలు ఈ ప్రపంచంలో మిమ్మల్ని తప్ప ఇంకెవరినీ అంతగా నమ్మరు.

పైన చెప్పుకున్న విషయాలపై అబ్బాయిలు అమ్మాయిలు మీ కామెంట్ తెలుపవచ్చు..  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon