Link copied!
Sign in / Sign up
40
Shares

2 ఏళ్ళ పిల్లాడికి జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుంటే తల్లితండ్రులకు నిద్ర పట్టదు

ఈ బాధాకరమైన సంఘటన గురించి వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. గుండె ధైర్యం ఉంటేనే ఈ విషయం గురించి తెలుసుకోండి. బెడ్ పై ఆడుకుంటుండగా 3 పిన్స్ కరెంట్ ప్లగ్ పిల్లాడి తలలో గుచ్చుకుపోయింది.  దాదాపు 3 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత తలలో ఇరుక్కుపోయిన  ఆ ప్లగ్ ను తీసివేశారు వైద్యులు. అసలేం జరిగిందో చూడండి.

రాత్రి 11 గంటలప్పుడు జరిగిన ఘటన

ఈ చిత్రంలో కనిపిస్తున్న 2 ఏళ్ళ పిల్లాడి పేరు చెన్ చెన్. చైనాకు చెందిన ఈ బాబు, రాత్రి 11 గంటల సమయంలో తన బెడ్ పై అమ్మానాన్నలతో కలిసి ఆడుకుంటూ, బెడ్ పై గెంతుతూ ఉండగా కాలు జారి కిందపడ్డాడు. దీంతో కరెంట్ ప్లగ్ నుండి బయటకు తీసివేసిన 3 పిన్ ప్లగ్ పిల్లాడి బ్రెయిన్ లో ఇరుక్కుపోయింది. బాబు ఆడుకుంటుండగా ప్లాస్టిక్ బాల్ పై కాలు వేయడంతో జారి కిందపడ్డాడని, ఆ ప్లగ్ అక్కడ ఉండటం వలన తలలోకి ఇరుక్కుపోయిందని బాబు తల్లి తెలిపారు.

3 గంటల పాటు జరిగిన ఆపరేషన్

తమ 2 ఏళ్ళ కొడుకు తల వెనుక ఇరుక్కుపోవడంతో వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లారు తల్లితండ్రులు. ముందుగా ఎక్స్ రే తీసి, ఎలా ఉందో తల్లితండ్రులకు చూపించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని, లేకపోతే ప్రమాదం అని డాక్టర్లు సూచించారు. దాదాపు 3 గంటల పాటు కష్టపడి బాలుడి  తలలో ఇరుక్కున్న 3 పిన్ ప్లగ్ ను బయటకు తీసివేశారు. ఇది జరిగి కొన్ని రోజులు అవుతుంది. ప్రస్తుతం బాబు సంతోషంగా ఉన్నాడు.

ఇది ప్రతి తల్లితండ్రులు తెలుసుకోండి

మీ పిల్లలు ఆడుకునేటప్పడు ఫోన్ ఛార్జర్స్, కరెంట్ వచ్చే చోటు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ల దగ్గర, ప్రమాదకరం  అనిపించే చోటు పిల్లలకు దగ్గరగా, అందుకునే విధంగా ఉంచకండి. మీ చిరునవ్వుకు కారణమైన మీ పిల్లలకు ఏమీ కాకుండా జాగ్రత్తపడండి. అందరికీ SHARE చేస్తారని ఆశిస్తున్నాం.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon