Link copied!
Sign in / Sign up
20
Shares

2 వ త్రైమాసికంలో గర్భంలోని పిల్లలు ఏ విధంగా ఎదుగుతారో ఈ అద్భుతాన్ని అస్సలు మిస్ అవ్వకండి..

గర్భం దాల్చిన తరువాత 2 వ త్రైమాసికం చాలా అందంగా హాయిగా ఉంటుంది. ఎందుకంటే మొదట త్రైమాసికంలోలా ఎక్కడ గర్భస్రావం అవుతుందో అని భయం ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. అందుకే అందరూ ఈ సమయాన్ని ప్రెగ్నన్సీ హనీమూన్ అని అంటారు. ఈ సమయంలో ఆహార విషయంలో కూడా చాలా హాయిగా ఉంటుంది, మొదటి త్రైమాసికం లాగా మార్నింగ్ సిక్నెస్, వంటి వచ్చేలా ఉండడటం ఉండదు.

2వ త్రైమాసికంలో గర్భంలో పిల్లల ఎదుగుదల ఇలా ఉంటుంది

గర్భంలో పిల్లల ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుసుకోవడం మంచిది. నిజంగా చెప్పాలంటే ఇటువంటి విషయాలు తెలుసుకుంటే మనసుకి హాయిగా ఉంది ప్రెగ్నన్సీ సమయంలో ఆత్మస్థర్యం పెరుగుతుంది.

4వ నెల

చేతి మరియు కాళ్ళ గోర్లు చాలా పొడవుగా పెరుగుతాయి. గర్భంలోని బిడ్డ ఈ వయస్సులోనే బొత్సను వేలుని నోట్లో పెట్టుకొని సప్పరించడం మొదలు పెడతాడు. పాపం ఎదో ఒక టైం పాస్ కావాలి కదా! తల్లికి కూడా బిడ్డ యొక్క కదలిక కొంచెం కొంచెంగా తెలుస్తుంటుంది. ఈ సమయంలోనే గర్భమావి కూడా పూర్తిగా తయారయి ఉంటుంది. ఇంకో చిత్రమైన విషయం తెలుసా, మీ బిడ్డ గంట గంటకు పాస్ పోస్తుంటాడు.

5వ నెల

కాను బొమ్మలు కూడా వచేసుంటాయి ఈ పాటికే. అంతే కాకుండా వినికిడి శక్తి కూడా బాగా పెరిగుంటుంది. ఈ సమయంలోనే పిల్లలు గర్భాశయంలో ఎక్కువుగా కదలడం మొదలు పెడతారు. సన్నటి జుట్టు సీతారాం అంత వస్తుంది. ఇప్పుడు బిడ్డ మెల్లగా పుట్టే పొసిషన్లోకి కానీ తలా కిందకు ఉండే పోసిషన్ లోకి కానీ తిరుగుతాడు.

6 వ నెల

ఈ నెలలో పిల్లల కంటి చూపు బాగా పెరుగుతుంది. చీకటిని వెలుతురుని బిడ్డ గుర్తుపట్టగలడు. బిడ్డ కళ్ళు తెరిచి చూడగలడు. అంతే కాకుండా కూడా పెరుగుతుంది. బిడ్డ తన బొత్సను వేలితో మిగతా వేళ్ళని రుద్దడం కూడా మొదలవుతుంది.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon