అమ్మలు, అమ్మాయిలు ఒక్కసారి ఇది చదవండి : మీ ఆడపిల్లల గురించి ఆలోచించండి
18 ఏళ్ళ అమ్మాయిని చూడగానే.. కొందరు పెద్దవాళ్ళు అంటారు.. అరే!! అమ్మాయికి పెళ్లి వయసు వచ్చేసిందే.. వచ్చే పెళ్లి చేయబోతున్నారు.. అని. ఆ చదువేదో కానిచేస్తే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని తల్లి తండ్రులు కూడా అనుకుంటారు.. దాంట్లో తప్పేంలేదు.. వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ తర్వాత, వాళ్ళ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునే అబ్బాయి చేతిలో పెట్టాలని ఆశ ఉండటం సహజమే. కాని ఎవ్వరు ఆ అమ్మాయి మనసులో ఏముంది అని ఎప్పుడూ అడగరు. ఈ కాలంలో కూడా అలా అడిగే వాళ్ళు చాలా తక్కువ. ఇంకా కూడా అమ్మాయిలను చాలా బలహీనవంతులుగా ఈ లోకం పరిగణిస్తుంది.. కాని అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు.. ఏదైనా..! ఇది ఇప్పటికే చాలా మంది నిరూపించారు కూడా.. తన కలల్ని సాకారం చేసే వృత్తుల్ని ఎంచుకొని, మగవాళ్ళు కూడా చేయలేని సాహసాలు చేసి అందరి ప్రశంసలను అందుకున్నారు. కాని కొంతమంది అమ్మాయిలు మాత్రం ఈ లోకం చేతిలో బలైపోతున్నారు. చాలా మంది అమ్మాయిలు తాము అనుకున్నది సాధించలేక, ఈ లోకం లోని చేడును గుర్తించలేక మోసపోతున్నారు.. దీనికి ముఖ్య కారణం అవగాహనా లోపం..
అవగాహనా లోపం..
అవును అవగాహనా లోపమే.. అమ్మాయిలకే కాదు ప్రతి ఒక్కరికి తల్లి తండ్రులు మంచితో పాటు చెడుని మరియు వాటిని ఎలా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలో కూడా చిన్నప్పటినుండి వివరంగా చెప్పాలి. ఆ ఇవన్నీ మనకెందుకులే మన అమ్మా నాన్న మనతో ఉన్నారు కదా అని అమ్మాయిలు నిర్లక్ష్యం చేయకూడదు, వాళ్ళు మీకెప్పుడూ తోడుంటారు అని అనుకోడవడం మంచిది కాదు. ఈరోజుల్లో ఏమేమి జరుతున్నాయి అని రోజూ పత్రికల్లో మరియు వార్తల్లో చూస్తున్నాం. మనకు అలాంటివి ఎదురుపడవు అని అనుకోవడం అమాయకత్వం. ఏదైనా.. ఎపుడైనా.. ఎవరికైనా.. జరగొచ్చు, వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.

కాబట్టి ఇది అడగొచ్చు, ఇది అడగకూడదు అని లేకుండా ప్రతి ఒక్కటి సమయానుగుణంగా తల్లి తండ్రులనో లేదా మీకు నమ్మకం ఉన్నవాళ్ళనో అడిగి తెలుసుకోవడం సూచించతగ్గ విషయం. ఈ లోకంలో ఏదో ఒక సమయంలో చెడును ఎదుర్కోవాల్సొస్తుంది అప్పుడు దాని గురించి అవగాహన లేకపోతే చాలా వరకు దానికి బలి కావాల్సొస్తుంది.. జీవితం అందరికి రెండో అవకాశం ఇవ్వదు.. జాగ్రత్త!!!
మొండితనం..

తల్లి చిన్నపుడు నిప్పుని తాకవద్దు అది కాలుతుంది అని చెపుతుంది.. అపుడు మనం అమ్మ చెప్పింది వింటాం.. కానీ మొండి చేసి దాన్ని తాకితే ఏమవుతుంది.. చేయి కాలడమే కాక, మచ్చ పడుతుంది. కాబట్టి అన్నింటిని అనుభవపూర్వకంగా తెలుసుకుకోవాలి అని అనుకోకూడదు.. కొన్నిసార్లు మన తల్లి తండ్రులు చెప్పింది నమ్మాలి మరియు దానికి అనుగుణంగా నడుచుకోవాలి. చాలా మంది మొండితనంతో తల్లి తండ్రుల కన్నా వాళ్ళకే ఎక్కువ తెలుసు అని ముందుకు పోయి మోసపోతారు.. సరే మీ మాటే నిజం అనుకుందాం మీ తల్లి తండ్రులకు మీ కన్నా ఎక్కువ తెలీదు అనుకోండి కాన్ని మీకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. ఈ కాలంలో ఏదన్నా సమస్య లేక ఏదన్నా సందేహం వచ్చినా కూడా ఒక మంచి సైకియాట్రిస్ట్ ని సంప్రదించడం సర్వ సాధారణం అయిపోయింది. మీరు అలాంటి వాళ్ళ సలహా అడగండి. ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని అస్సలు వెనకాడకండి ఎందుకంటే ఇది మీ జీవితం వాళ్ళది కాదు. మొండితనానికి పోయి జీవితాన్ని నాశనం చేసుకోకండి!!
రెండో లక్ష్యం లేకపోవటం..
కొందరు జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటారు.. అది సాదించగానే అంతా అయిపోయింది అని విశ్రాంతి తీసుకుంటారు.. ఆంగ్లంలో ఒక సామెత ఉంది కదా, "An idle mind is the devil's workshop" అని, అలా, విశ్రాంతి తీసుకోవాలని ఆలోచన వచ్చినపుడే మీ పతనం ఆరంభం అయినట్లు. అలాంటి బుర్ర త్వరగా చెడుకు ఆకర్షింపబడగలదు. కాబట్టి ఒక లక్షాన్ని చేరుకునేలోపే ఇంకో లక్ష్యం గురించి అలోచించి దానికి అనుగుణంగా ఎప్పుడు కొత్త విషయాల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలి.

ఇలా కొన్ని ముందు జాగ్రత్తలతో అవగాహన పెంచుకుంటూ, అన్నీ కష్టాలకు మరియు అన్నీ రకాల చెడులకు మీదైనా శైలిలో సమాధానం చెపుతూ ముందుకు సాగిపోండి. పొరపాటున ఎక్కడైనా ఎదురుదెబ్బ తిన్నా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందడుగు వేయండి. మీ తల్లి తండ్రులు మరియు మంచి స్నేహితులు మీకు తోడుంటారు అని గుర్తుపెట్టుకోండి. ఇక మీ లక్ష్యాలను చేరకుండా మిమ్మల్ని ఎవరు ఆపలేరు..!!
ఆడపిల్లలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అని, ఇల్లు కళకళలాడుతూ ఉంటుందని ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. అదే ఆడపిల్లలకు ఏదైనా జరగరానిది జరిగితే గుండెలు పగిలేలా రోధిస్తాం, ఇలా ఏ తల్లితండ్రుల జీవితంలో జరగకూడదనే ఒక ఆడపిల్లగా ఇది చెప్పాను. మీకు నచ్చితే అందరికీ తెలిసేలా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.
