Link copied!
Sign in / Sign up
4
Shares

గర్భవతి అని తెలిసి ఇంట్లో నుండి గెంటేశారు : నడిరోడ్డుపై బిడ్డకు జన్మను ఇచ్చిన యువతి

ప్రపంచంలో ఎంత మంది ఉన్నా సరే మనకు ఎదురయ్యే సమస్యకు ఒక్కరు కూడా తోడు లేకపోతే ప్రత్యక్ష నరకంతో సమానమే. అటువంటిది ఒక మహిళ ఎవరి అండ, తోడు, సాయం లేకుండా నడిరోడ్డుపై ఆడపిల్లకు జన్మను ఇచ్చింది. బిడ్డకు జన్మను ఇస్తున్నాను అనే దానికన్నా కన్నవాళ్ళు గెంటేశారు, హాస్పిటల్ లోకి రానివ్వలేదు. నడి వీధిలో అందరూ చూస్తుండగా బిడ్డకు జన్మను ఇచ్చి తల్లి గొప్పదనాన్ని చాటుకుంది.. బాధాకరమైన ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ తెలిసేలా  చేరేలా SHARE చేయగలరు.

ప్రేమించిన వాడు మోసం చేస్తే, ఇంట్లో గెంటేశారు

జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో యువతీయువకులు ప్రేమించుకున్నారు. తెలిసో తెలియకో వయస్సు ప్రభావం వలన ఇద్దరి మధ్యా తప్పు జరిగిపోయింది. కొన్ని నెలల తర్వాత అమ్మాయి గర్భం దాల్చానని తను ప్రేమించిన వాడికి చెప్పడంతో ఏమీ తెలియనివాడిలా తనకు సంబంధం లేదన్నట్లుగా వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి తల్లితండ్రులకు చెబితే, ఊర్లో తెలిస్తే తమ ఇంటి పరువు, మర్యాద పోతాయని ఈ ఊర్లో ఉండకూడదని ఇంట్లో నుండి ఊర్లో నుండి గెంటేశారు.

17 వయస్సులో ఒంటరిగా 4 నెలలు

ఇంట్లో నుండి బయటకు పంపించడంతో దాదాపు 4 నెలలకు పైగా ఒంటరిగా తన బిడ్డను బ్రతికించుకోవడానికి బ్రతికింది. హాస్పిటల్ కు వెళ్లి వైద్యం చేయమని అడగగా ఒక్కరు కూడా చలించకపోగా బయటకు పంపించారు. నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ అమ్మాయి బట్టల నుండి రక్తం కిందకు కారుతోంది. నొప్పులు భరించలేక అక్కడికక్కడే నడివీధిలో అందరూ చూస్తుండగా ప్రసవవేదనను భరించి పండంటి ఆడపిల్లకు జన్మను ఇచ్చింది. తనకు బిడ్డను చూసుకుంటూ మురిసిపోయింది కానీ అమ్మా సాయం చేయండని అడగలేకపోయింది. కన్నవాళ్ళే ముందుకు రాలేదు, ఇక వీళ్ళేం వస్తారు అని అర్థం చేసుకుంది.

దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు

అందరూ ఏదో సినిమా చూస్తున్నట్లు ప్రసవిస్తున్న మహిళను చూశారు కానీ అటుగా వెళ్తున్న ఒక్క వ్యక్తి మాత్రం రక్తపు మడుగులో ఉన్న ఆ యువతిని చూసి చలించిపోయి హాస్పిటల్ కు తీసుకెళ్లగా వాళ్ళు లోపలికి రానివ్వలేదు. హాస్పిటల్ కు 100 అడుగుల దూరంలోనే ప్రసవించింది. వెహికల్స్ ను ఆపమంటే ఎవరూ ఆపలేదు, ఒక్కరు సాయం చేయడానికి ముందుకు రాలేదు. అక్కడున్న మహిళలను వచ్చి సాయం చేయండమ్మా అని వేడుకుంటే ఒక వస్త్రం ఆమెపై కప్పి ఆటో రిక్షా ను అందులోకి ఎక్కించారు. తనకు తెలిసిన వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఆ వీడియో ఇదే…

17 ఏళ్ళ యువతి అయినా, 28 ఏళ్ళ మహిళ అయినా సరే ఆపదలో కనీస సహాయం చేద్దాం..తను ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిడ్డకు జన్మను ఇవ్వాలని పరితపిస్తున్న అమ్మ గొప్పదనానికి అండగా నిలుద్దాం. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon