Link copied!
Sign in / Sign up
12
Shares

16 రోజుల బిడ్డను ఎత్తుకెళ్లిన కోతి : బావిలో పడ్డ చిన్నారి

మన ఇళ్లలో అయినా ఇంకెక్కడైనా సరే పసిపిల్లలు ఉన్నచోట ఎంతో అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు చుట్టూ ఏం జరుగుతుందో ఒక కంట కనిపెడుతూ ఉండాలి, లేకపోతే ఇక్కడ జరిగినట్లే జరిగే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితి ఎదురైన తర్వాత బాధపడే దానికన్నా ముందే మన జాగ్రత్తలో ఉండటం మంచిది. ఇక్కడ అసలు ఏం జరిగిందో కన్నీరు పెట్టుకోకుండా ఉండలేరు..

అమ్మ పక్కనే పడుకున్న బిడ్డ..

16 రోజుల పసికందు అమ్మ పక్కనే పడుకుని నిద్రిస్తుండగా ఇంటి పై కప్పుల మీదుగా కోతి వచ్చి ఎత్తుకువెళ్లి పోయిందట. అలా ఎత్తుకు వెళ్లడంతో వీళ్ళ ఇంటి వెనుకాల ఉన్న 15 అడుగుల బావిలో కోతి నుండి జారిపడిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ బాధాకరమైన ఘటన శనివారం జరగగా అటవీ అధికారులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. ఒక రోజు తర్వాత ఆ బావి దగ్గరకు నీటికోసం వచ్చిన మహిళకు బావిలో తేలియాడుతున్న బిడ్డను చూసి సమాచారం అందించింది. బాలుడి శరీరంపై గాయాలను బట్టి కోతి బిడ్డను తీసుకువెళ్తుండగా, జారిపోయి పడి ఉండవచ్చు అని తెలిపారు. 16 రోజుల బిడ్డను చూసి కన్నీరు మున్నీరు అయ్యారు ఆ తల్లితండ్రులు. ఒడిశా కటక్ డిస్ట్రిక్ట్ లోని తల్లాబస్తా అనే గ్రామంలో ఇది జరిగింది, ఈ చుట్టు పక్కల కోతుల బెడద ఎక్కువగా ఉందని, అటవీప్రాంతంలోకి వీటిని తరలించారని ఆ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు.

అందుకే పసిపిల్లలున్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి..  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon