Link copied!
Sign in / Sign up
10
Shares

15 నెలలు చిన్నారికి ఎలాంటి ఆహరం తినిపించాలో తెలుసా ?


బాల్య దశలో పెద్ద వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే పిల్లలు ఎదిగే కొద్ది అంత ఆరోగ్యంగా ఉంటారు. నెలల పిల్లలు సంవత్సరంలోకి వచ్చే సరికి వారి ఆహారపు  అలవాట్లు క్రమ క్రమంగా మారిపోతుంటాయి. వారికి ఏ ఆహారం అందించాలి, ఎందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయనే విషయంలో కాస్త శ్రద్ధ వహిస్తే ఎలాంటి అలర్జీస్, రాషెస్ వంటి అనారోగ్యాలు వారి దరిచేరకుండా ఉంటాయి. క్రింద చెప్పిన ఆహర పోషకాలు గల డైట్ పిల్లలకి అందిస్తే వారు ఎప్పటికి  ఆరోగ్యంతో ఉంటారు

1. పళ్ళు మరియు కూరగాయలు

పళ్ళు మరియు కూరగాయలలో పోషక విలువలు అత్యధికంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా బ్లడ్ సెల్స్ పెరగడం, ఎముక అభివృద్ది, చర్మం కాంతివంతంగా మారడం, కడుపు రుగ్మతలకి ఇవి ఎంతగానో దోహదపడతాయి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటే అనారోగ్యం అనేది పిల్లల చెంతకి రాకుండా నివారించవచ్చు.

2. సంపూర్ణ గోధుమ ఆహారం

పిల్లలకి సంపూర్ణంగా గోధుమని ఆహారంగా అందిస్తే వారి శరీరంలో ఫైబర్ శాతం పెరుగుతుంది. ఫైబర్ వలన పిల్లలలో విసర్జన సమస్యలు తొలగిపోతుంది. మలబద్ధకం మందగిస్తుంది. గోధుమని ఎక్కువ మొత్తంలో తీసుకంటే పిల్లలు శక్తివంతంగా మారడంతో పాటు ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటారు.

3. ప్రోటీన్ మరియు కొవ్వు పదార్ధాలు

మీ పిల్లలు ఎదుగుతున్న క్రమంలో తప్పని సరిగా వారి ఆహారంలో ప్రోటీన్ మరియు కొవ్వు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి. ఇవి పిల్లలో బ్రెయిన్ సెల్స్ (మెదడుకి సంబంధించిన కణాలు) అభివృద్దికి ఉపయోగకరంగా ఉంటాయి. బియ్యం రూపంలో కార్బోహైడ్రేట్లు బంగాళాదుంపల రూపంలో కొవ్వుని మీ బిడ్డకి అందించి వారిని శక్తివంతం చేసే ఉత్తమ మార్గంగా ఇవి ఉన్నాయి.

4. డైరీ ప్రొడక్ట్స్

పాలు, జున్ను, పన్నీర్, క్రీమ్, పెరుగు వంటి పదార్ధాలు మీ పిల్లలలో కాల్షియం ఎదుగలతో పాటు ఎముకలని శక్తివంతం చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహార పదార్ధాలు ఇవి :

a. వెన్న , తేనెతో చేసిన గోధుమ కేకులు

b.పూరీల్లో రకరకాలున్నాయి. వాటిలో బీట్ రూట్ తో , క్యారెట్ తో చేసినవైతే మరీ మంచిది. రంగురంగుల పూరీల్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వాటి రుచిని వాళ్లు బాగా ఇష్టపడతారు.

c. కిచిడీ

d. కర్డ్ ఓట్స్.

పిల్లలకి ఇచ్చే ఆహారం తయారు చేయడానికి కొన్ని పద్దతులున్నాయి అవి..

1. పిల్లలు కోరిన విధంగా వారికి నచ్చిన ఆహారం తయారు చేయాలి. అది మీకు ఓ ప్రయోగమే కావచ్చు, కాని పిల్లలు ఆ ఆహారాన్ని చూడగానే ఎంతో ఇష్టంగా తింటారు.

2. మీ పిల్లలని ఆహారం విషయంలో ఇదే తినాలని అస్సలు బలవంతం చేయోద్దు. పౌష్టికారాన్ని వారికి ఇష్టమైన రీతిలో అందించాలి.

3. తినే పదార్ధాలని వారి ముందుంచి , వాటిని ఏ రకంగా ఆస్వాదిస్తారనేది గమనించాలి. ఈ విషయంలో వారికి ఎంత స్వేచ్చనిస్తే అంత బాగా ఆహారాన్ని స్వీకరిస్తారు.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon