Link copied!
Sign in / Sign up
3
Shares

13 ఏళ్లకే తండ్రి అయిన బాలుడు : ఆశ్చర్యపరిచే అసలు నిజాలు ఇవే

అబ్బాయి వయస్సు 13 ఏళ్ళు, అమ్మాయి వయస్సు 15 ఏళ్ళు, కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత అందమైన ఆడపిల్ల వారికి జన్మించిన బిడ్డగా ప్రపంచం మొత్తం వైరల్ అయింది. ఎందుకు వైరల్ అయ్యిందంటే చిన్న వయస్సులోనే తండ్రి అయిన బాలుడిగా రికార్డులకెక్కడమే.  గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న ఈ న్యూస్ గురించి వివరంగా అసలు నిజాలతో మీకోసం..

13 ఏళ్లకే తండ్రి

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇతని పేరు అల్ఫీ పాటెన్, ఈ అమ్మాయి పేరు చాంటెల్లీ స్టెడ్ మన్, వీరిద్దరి కలయిక వలనే వారి చేతుల్లో ఉన్న మైసీ అనే ఆడపిల్లకు జన్మను ఇచ్చినట్లు ప్రపంచం మొత్తం వైరల్ అయ్యింది. శృంగారం అనే పదం కూడా తెలియని వయస్సులో 13 ఏళ్లకే తండ్రి అయిన  బాలుడిగా బ్రిటన్ నుండి ప్రపంచం మొత్తం వైరల్ అయ్యింది. ఐతే తను ఈ పాపకు తండ్రినా కాదా అనే విషయం ఏమీ తెలియకపోయినా ఆప్యాయంగా తన చేతుల్లోకి, ఒడిలోకి తీసుకుని ఆడిస్తూ సంతోషపడ్డాడు.

మీడియా అడిగిన ప్రశ్నలు ఇవే..

అమ్మాయి తల్లి అయిన విషయం కన్నా 13 ఏళ్ళ వయస్సులోనే ఈ అబ్బాయి తండ్రి కావడంతో బ్రిటన్ మీడియా అతడిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. దీనికి గల కారణం తెలుసుకోవాలని వెంటపడ్డారు. దీంతో ఈ అబ్బాయి తల్లితండ్రులు బాబును బయటకు, స్కూల్ కు పంపించకుండా ఇంట్లోనే ఉంచారు. ఐతే ఒక రిపోర్టర్ ఈ పాపను ఆర్థికంగా నువ్వు దగ్గరుండి చూసుకోగలవా అని ప్రశ్నించాడు. అంటే ఏమిటని ఆ రిపోర్టర్ నే తిరిగి ప్రశ్నించాడు. అల్ఫీ పాటెన్ తల్లి ఈ విషయం పట్ల బాధతో మనస్సు ముక్కలైంది, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది.

అబ్బాయి తల్లి తెలుసుకున్న నిజాలు

అల్ఫీ పాటెన్ మైసీ అనే పాపకు తండ్రి అని ప్రపంచం అంటుంటే అసలు ఈ విషయం గురించి ప్రపంచానికి అసలు నిజం ఏంటో నిరూపించాలనుకుంది. అల్ఫీ పాటెన్ కుటుంబం చుట్టు పక్కల వాళ్ళు, స్టెడ్ మన్ ఇంటి పక్కవారు చెప్పిన కథనాల ప్రకారం, తండ్రి కాదా, అవునా అని చేసిన పరీక్షల ప్రకారం అల్ఫీ పాటెన్ తండ్రి కాదని తెలిసింది. ఆ పిల్లాడికి తెలియకుండానే అతడిని ఆ పాపకు తండ్రి అనేలా చేశారు.

అసలు తండ్రి ఎవరంటే..?

ఒక రాత్రి జరిగిన పార్టీలో టైలర్ బార్కర్ అనే అతను స్టెడ్ మన్ ఇంటి పక్కనే ఉండేవాడు. మద్యంమత్తులో జరిగిన తప్పిదం వలనే ఈ విధంగా జరిగిందని మీడియా, సోషల్ మీడియాలలో కథనాలు వచ్చాయి. తన కొడుకు జీవితం, తల్లితండ్రులుగా పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాల్సిన బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోయారు అని అందరూ వేలెత్తి చూపడంతో ఆ ఊరు వదిలి వెళ్లిపోయారు. కొత్త జీవితం మొదలుపెట్టి ప్రశాంతంగా తమ జీవితం సాగించారు. అలాగే పిల్లలైన వీరికి సేఫ్టీ, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం అని అంటున్నారు.

నిజానిజాలు తెలుసుకోకుండా ఒకరిపై నింద వేయడం సరైనది కాదు, తెలిసితెలియని వయస్సులో చేసిన తప్పుఒప్పుల గురించి పిల్లలకు పేరెంట్స్ చెప్పాలి..  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon