Link copied!
Sign in / Sign up
92
Shares

11 ఏళ్ళ ఈ కుర్రాడు చనిపోయేముందు చేసిన పనికి ప్రపంచం కన్నీరు పెట్టుకుంది : అసలు ఏం జరిగిందంటే..

మనం జీవితంలో చేసే ఒక్క మంచి పనైనా సరే కొన్ని వందల ఏళ్ళు మన గురించి మాట్లాడుకునేలా చేస్తాయని అంటారు మన పెద్దలు. అలా 11 ఏళ్ళ వయస్సులోనే ప్రపంచానికి నిజమైన హీరో అని నిరూపించాడు ఈ కుర్రాడు. హృదయాన్ని కాస్త బాధపెట్టేదే అయినా కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచాడు. ఈ నిజమైన హీరో గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలనేదే మా ఉద్దేశం, ఈ అబ్బాయి చేసిన పని మీకు నచ్చితే వెంటనే అందరికీ SHARE చేయండి..

నేను చనిపోయినా పిల్లలు బ్రతకాలి..

చైనాకు చెందిన ఈ అబ్బాయి పేరు లియాంగ్ యోయి. 9 ఏళ్ళ వయస్సు నుండి బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్నాడు. ఇంకా ఎంతో కాలం బ్రతకడం కష్టమని డాక్టర్లు తేల్చిచెప్పారు. తమ బిడ్డ పరిస్థితి తెలిసి తల్లితండ్రులు ఏడవని రోజు లేదు. ఐతే ఒకరోజు అమ్మ దగ్గరకు వెళ్లి ‘’అమ్మా,  నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను చనిపోతానని నాకు తెలుసు, చనిపోయాక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఏ ఒక్కరికైనా లేదా పిల్లలకైనా నా అవయవాలను దానం చేసి వారిని బ్రతికించాలనుకుంటున్నాను అని చెప్పాడు. తన బిడ్డ గొప్ప మనస్సుకి ఆ తల్లి కళ్ళు చెమ్మగిల్లాయి.

డాక్టర్లు, ప్రపంచం హ్యాట్సాఫ్ చెప్పింది..

రెండేళ్ల తర్వాత ఈ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి తీవ్రమైంది. డాక్టర్లకు కూడా ఈ విషయం చెప్పారు కుటుంబ సభ్యులు. ఆ అబ్బాయి తీసుకున్న నిర్ణయానికి హర్షించారు. 11 ఏళ్ళ లియాంగ్ యోయి లివర్, కిడ్నీలను వేరేవాళ్లకు ట్రాన్స్ఫర్ చేసి బ్రతికించారు. లియాంగ్ యోయి స్ట్రెచర్ పై ఉండగా ఆ హాస్పిటల్ డాక్టర్లు తల కిందకు ఉంచి హ్యాట్సాఫ్ తెలిపారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అవయవదానం అవగాహన గురించి ప్రతి ఒక్కరికీ తెలియాలి,  ఇతరుల ప్రాణాలను కాపాడటం కన్నా గొప్ప పని ఏముంటుంది.

11 ఏళ్ళ ఈ అబ్బాయి చేసిన ఈ గొప్ప పని మీకు నచ్చి ఉంటే SHARE చేయండి..  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon