Link copied!
Sign in / Sign up
28
Shares

10 ఏళ్ళ కొడుకుపై తల్లితండ్రుల కిరాతకం : అబద్ధం చెప్పాడని చిత్రహింసలు పెట్టారు, వీడియో చూడండి

అమ్మ, నాన్న కనిపించే దేవుళ్ళు అని అంటారు. కానీ ఇక్కడ మాత్రం కన్నవారే కసాయిలుగా మారారు. తప్పు చేశాను వదిలివేయమని చెబుతున్నా కనికరించలేదు. 7 వ తరగతి చదువుతున్న తమ 10 ఏళ్ళ కొడుకును తండ్రి కిరాతకంగా కొడుతుంటే, కొడుకును కొట్టవద్దని ఏ మాత్రం అడ్డుచెప్పకుండా తల్లి వీడియో తీస్తూ ఆనందించింది.  హృదయం ఉన్న ప్రతి ఒక్కరినీ బాధపెడుతున్న ఆ వీడియో ఇదే..

అబద్ధం చెప్పాడని..సెల్ ఫోన్ ఛార్జర్ తో కొట్టాడు

ఈ వీడియోలో ఈ 10 ఏళ్ళ కుర్రాడు, గత కొన్ని రోజులుగా ట్యూషన్ కు వెళ్తున్నాడని ఇంట్లో అమ్మనాన్నలతో చెప్పాడు. ఐతే ఒకరోజు తన కొడుకు ట్యూషన్ కు వెళ్లట్లేదని అబద్ధం చెప్తున్నాడని అమ్మకు తెలియడంతో ఆ విషయాన్ని పిల్లాడి తండ్రికి చెప్పింది. ఈ వయస్సులో ఇటువంటి అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావ్, అబద్ధాలు చెబుతావా అంటూ బెడ్ రూమ్ లోని కుర్చీలో కూర్చున్న కొడుకుని చేతికి చిక్కిన సెల్ ఫోన్ ఛార్జర్ తో కొట్టి, ఆ తర్వాత రెండు చేతులతో ఎత్తుకుని మంచంపై రెండు మూడు సార్లు విసిరాడు. మంచం మీద ఉన్న కొడుకుని కిందకు లాగి కాళ్ళతో కిరాతకంగా తన్నాడు. కొడుకుని ఇలా కొడుతుంటే అమ్మ వీడియో తీసింది.

వీడియో ఎలా బయటకు వచ్చింది..?

దాదాపు నెలన్నర క్రితం బెంగూళూరులోని ఆర్ ఆర్ నగర్ లోని గ్లోబల్ టెక్ పార్క్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.  పిల్లాడి తండ్రి ప్లంబర్ గా పనిచేస్తున్నాడు. గత కొద్దిరోజులుగా ట్యూషన్ కు వెళ్తున్నానని వెళ్లకుండా అబద్ధం చెప్పాడని తెలియడంతో ఇలా ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు.  ఐతే ఇటీవల తన ఫోన్ ను పిల్లాడి తల్లి రిపేర్ కు ఇచ్చి, ఇందులో ముఖ్యమైన ఫొటోలు వీడియోలు ఉన్నాయ్, డిలీట్ చేయవద్దని చెప్పడంతో షాప్ అతను అందులో ఏముందో అని చూశాడు. తమ కొడుకును చిత్రహింసలకు గురిచేస్తున్న ఆ వీడియో చూసి పోలీసులకు ఫోన్ చేశాడు.

తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు

తమ కొడుకును ఎలాంటి కనికరం లేకుండా ఇలా కిరాతకంగా హింసించడంతో పిల్లాడి తండ్రిని జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద క్రిమనల్ కేసుపై అరెస్ట్ చేశారు. మీరే చెప్పండి స్కూల్ లోనో, కాలేజ్ లోనో టీచర్స్ కొడుతున్నారంటేనే తల్లితండ్రులు తట్టుకోలేరు. కానీ పేరెంట్స్ ఇలా చేస్తే పిల్లలు ఎవరితో చెప్పుకోవాలి. నిజమే మీరు కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు, కానీ ఈ తప్పు గురించి పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి, కానీ ఇలా చేయడం భావ్యమా అని నిలదీస్తున్నారు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon