Link copied!
Sign in / Sign up
67
Shares

10 నెలల పిల్లలకు పెట్టాల్సిన ఆహారం


పిల్లలు 10వ నెలలోకి అడుగుపెట్టేసరికి ఆహారం విషయంలో మనకు ఉన్న సందేహాలు అన్నీ తీరిపోయుంటాయి.  ఇప్పటికే మన బిడ్డకు ఎలాంటి ఆహరం నప్పుతుంది ఎలాంటి ఆహరం పెట్టకూడదు వంటి వాటి మీద పూర్తిగా అవగాహన వచ్చేసుంటుంది. కాబట్టి ఈ సమయంలో చిక్కటి గుజ్జు వంటి ఆహారాన్ని మరియు కొన్ని కొత్త సాలిడ్ ఫ్యూడ్స్ని పరిచయం చేయవచ్చు. ఈ వయస్సులో పిల్లలు సాలిడ్ ఫుడ్ తినడానికి పెద్దగా మారం చేయరు. ఒకవేళ చేస్తునట్టు అయితే బుజ్జగించి కొన్ని రోజులు తినిపించండి, నిదానంగా అలవాటు అయిపోతుంది. ఈ వయస్సులోనే పిల్లలు తమ సొంతంగా తినడానికి ముందుకు వస్తారు. ఆలా వస్తే వారి చేతికి స్పూన్ ఇవ్వండి, పద్దతిగా తినలేరు, నేర్చుకుంటున్నాడు కాబట్టి కింద ఒక చాప వంటివి వేయండి. ఎక్కువ ఆహారం కింద పడిపోతుందని చెప్పి మీ పిల్లలకు మీరు తినిపించకండి, వారినే తిననివండి. ఇప్పుడు రోజు వారీగా ఎలాంటి ఆహారం తినిపించాలో తెలుసుకుందాము.

సోమవారం

ఉదయం లేవగానే పిల్లలకు తల్లి పాలు ఇవ్వండి. ఈ నెలలో టిఫిన్ కొంచెం ఇంట్రెస్టింగా గోధుమ దోశ లేదా గోధుమ కేకు ఇవ్వండి. భోజనానికి గంట ముందు ఇంకో సారి తల్లి పాలు ఇవ్వండి. భోజనానికి పెసర పప్పు కిచడి ఇవ్వండి. సాయంత్రం పియర్ లేదా దోస కాయ వంటివి కొద్దిగా తినిపించండి. రాత్రికి ఓట్స్ లేదా అరటి పండు తినిపించిన తరువాత పడుకునే ముందు తల్లి పాటు పట్టించండి.

మంగళవారం

రోజులానే ఉదయం తల్లి పాలు తాగించిన తరువాత ఇడ్లి కానీ స్టీమ్ దోశ కానీ టిఫిన్ సమయంలో తినిపించండి. అలాగే భజనానికి ముందు తల్లి పాలు తాగించిన తరువాత పెరుగన్నం తినిపించండి. ఇంట్లో చేసిన పెరుగు అయితే మంచిది. సాయంకాలం మెత్తగా ఉడకపెట్టిన క్యారట్ కానీ బంగాళా దుంప సలాడ్ తినిపించండి. డిన్నర్ కి వెజిటల్ దోశ మరియు నిద్రపోయే ముందు తల్లి పాలు ఇవ్వండి.

బుధవారం

ప్రతి రోజు ఉదయం, టిఫిన్కి భజనానికి మధ్యలో మరియు నిద్రపోయేముందు తప్పని సరిగా తల్లి పాలు ఇవ్వాలి. సంవత్సరంలోపు పిల్లల ఎదుగుదల ముఖ్యంగా తాళి పాల మీదనే ఆధార పడి ఉంటుంది. బుధవారం ఉదయం టిఫిన్ సమయంలో వెజిటల్ దోశ, భోజనానికి మెత్తగా ఉడికించిన అన్నంతో పాటు టమాటా రసం ఇవ్వండి. సాయంత్రం అరటి పండు ప్యాన్ కాక్స్ మరియు రాత్రికి గోధుమ గంజి తాగించండి.

గురువారం

ఈ రోజు టిఫిన్ కి వెజిటల్ ఉప్మా తినిపించండి. ఇది రుచిగా ఉండడంతో పిల్లలు ఇష్టంగా తింటారు. భోజనాయికి సాదా అన్నం మరియు పప్పు తినిపించండి. ఆపిల్ జ్యూస్ ని సాయంత్రం మరియు రాత్రికి చప్పటి సాంబార్ అన్నం తినిపించండి. క్రమం తప్పకుండ పైన చెప్పిన మూడు పూటలు తల్లి పాలు ఇవ్వండి.

శుక్రవారం

శుక్రవారం టిఫిన్ కి దలియా కిచడి తినిపించండి. వెజిటబుల్ రైస్ భోజనంగా ఇవ్వండి. సాయంత్రం ఒక గ్లాస్ ఆపిల్ మిల్క్ షేక్ తాగించండి. రాత్రికి ఇడ్లి కానీ స్టీమ్ దోశ తినిపించండి. అలాగే రోజు మూడు పూటలా తల్లి పాలు తాగించడం మాత్రం మానకండి.

శనివారం

పాలు తాగించిన తరువాత ఉప్మా రుచి మీ పిల్లలకు పరిచయం చేయండి. తరువాత కొంత సేపటికి పాలు తాగించి ఆకు కూరతో అన్నం భోజన సమయములో తినిపించండి. సాయంత్రం ఏదయినా పెరుగుతో కూడిన జ్యూస్ మరియు రాత్రికి పోహా లేదా ఉప్మా తినిపించండి. రోజు లాగే పడుకునే ముందు తల్లి పాలు తగ్గించండి.

ఆదివారం

ఆదివారం రుచిగా పిల్లలకు తినిపించాలంటే టిఫిన్ కిపెసర దోశ, మధ్యాహ్నం పప్పు కిచడి తినిపించండి. సాయంత్రం ఏదయినా పళ్ళ రసం మరియు రాత్రికి పిల్లలు ఇష్టంగా తినే దోశ లేదా రాగి తినిపించండి. మూడు పూటలా పాలు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon