Link copied!
Sign in / Sign up
341
Shares

“మీరు మీ భార్య పర్ఫెక్ట్ కపుల్!!!” అని సులభంగా చెప్పడానికి 5 గుర్తులు

మేమిద్దరం పర్ఫెక్ట్ కపుల్ లేనా? అని మీరు చాలా సార్లు అలోచించి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? అయినా ఒక భార్యాభర్తల జంట పర్ఫెక్ట్ కపుల్ అని ఎలా  చెప్పాలి?

మీ ఇద్దరు కలిసి ఫొటోల్లో బాగా కనిపిస్తేనో , ఇద్దరు ఎత్తు-బరువు సరిగ్గా సరిపోతేనో పరిపూర్ణ జంట అయిపోరు.  కలిసి బతకటం అనే ప్రయాణంలో, వడిదుడుకులను మీరిద్దరూ కలిసి ఎలా ఎదురుకుంటున్నారు, ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ వుంది, ఎంత ఓర్పుతో ఉన్నారు. ఇలాంటి విషయాలు, గుర్తులు మీరు పర్ఫెక్ట్ కపుల్ అవునా... కాదా ? నిర్ణయిస్తాయి. అలాంటి 8 గుర్తులు ఏంటో చూడండి.

1.ఒకరితో ఒకరు సమయం కడుపుతారు

ఆఫీస్ పనులు, ఇంటి పనులు, బయట పనులు అన్ని బాధ్యతలు ఇద్దరు పంచుకుంటారు. ఎవరి పనుల్లో వారు పడిపోయి ఇద్దరి కలిసి ప్రేమగా మాట్లాడుకోవడమే మర్చిపోతారు. అదే మీరు పర్ఫెక్ట్ కపుల్ అయితే ఎన్ని పనులున్నా కాసేపైనా ఇద్దరు కలిసి సమయం గడుపుతారు. లేకపోతే ఆ రోజు గడిచినట్టే ఉండదు.

2.మనసులో ఏది దాచుకోరు

ఒకరు చేసే పని ఇంకొకరికి నచ్చనప్పుడు. చెప్తే ఏమైనా అనుకుంటారనో, బాధపడ్తారనో మాటను దాచుకోవడం పర్ఫెక్ట్ కపుల్ ఎప్పుడు చేయరు. మీ ఇద్దరిలో ఎవరైనా తెలియకుండా ఏదైనా తప్పు చేసినప్పుడు. ఇంకొకరు ఆ తప్పును నిర్మొహమాటంగా చెప్పి సరి చేయాలి. అది వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తుంది.

3.లక్ష్యాలను కలిసి నిర్ణయిస్తారు

ఏమి జరిగినా ఈ ప్రపంచం మొత్తం ఒక వైపు మీరిద్దరూ ఒక వైపు. లక్ష్యాలను ఇద్దరు కలిసి నిర్దేశించుకుంటారు. వాటిని సాధించడానికి ఏమి చేయాలో ఇద్దరు కలిసి నిర్ణయిస్తారు. మీ ఆయన , మీరు కూడా ఇలానే చేస్తారా? అయితే మీరిద్దరూ పర్ఫెక్ట్ కపుల్.

4.ఒకరిని ఒకరు నిందించుకోరు

పర్ఫెక్ట్ కపుల్ ఎప్పుడు, ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తారు. ఒకరిపై ఒకరు వ్యతీరేకతతో కాదు. ఇద్దరు కలిసి చేసే పనిలో ఏదైనా తప్పు జరిగితే ఒకరి పై ఒకరు నిందలు వేసుకోరు. ఇద్దరు కలిసి జరిగిన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు.

5.సమస్యలను కలిసి పరిష్కరిస్తారు

భార్య భర్తల్లో ఎవరికైనా ఒకరికి సమస్య వస్తే, ఇంకొకరు దాన్ని తమ సమస్యగా భావించాలి. పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఇద్దరు కలిసి భరించాలి. ఎవరి సమస్య అయినా ఇద్దరు కలిసి పరిష్కరించాలి. ఇది పర్ఫెక్ట్ కపుల్ లక్షణం.

6.సన్నిహితంగా ఉంటారు

భార్య భర్తల మధ్య ఆరోగ్యకరమైన ఏకాంతంగా ఉండడం అవసరం. కానీ సన్నిహితంగా ఉండడం అంటే అలా ఉండటం మాత్రమే కాదు. భావోద్వేగాలను కూడా పంచుకోడం. ఈ ప్రపంచంలో ఏ విషయం గురించైనా , ఏ భయము లేకుండా ఒకరితో ఒకరు పంచుకోకలిగితే మీరిద్దరూ పర్ఫెక్ట్ కపుల్.

7.బయటవాళ్ళ పెత్తనాన్ని సహించరు

మీ ఇద్దరి మధ్య ఏమి జరుగుతుందో మీ ఇద్దరికి మాత్రమే తెలుసు. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు, బయటవాళ్ళు మధ్యలో వచ్చి పెత్తనం చేయడం ఒప్పుకోవద్దు. మీ గొడవలను మీరే పరిష్కరించుకోవాలి.

8.ఇద్దరు కలిస్తే అది మిథునం

ఒకరి లోని ఖాళీలను ఇంకొకరు పూరిస్తూ ఇద్దరు కలిసి చేసే ప్రయాణాన్ని పరిపూర్ణం చేయడమే పెళ్ళి. అలా చేసే వాళ్ళే భార్య భర్త. ఈ ప్రయాణం అందరికి ఒకేలా ఉండదు. అందరి సమస్యలకు పరిష్కారాలు ఒకటే కాదు. ఎదురయ్యే ఏ సమస్యనైనా ఇద్దరు కలిసి ఎదురుకోవడమే అన్నిటికి పరిష్కారం.  అలా చేయగలిగిన వాళ్ళే 'PERFECTTT COUPLE!!!' 

"మీరు PERFECT COUPLE" అని ఏ జంటకైనా మీరు చెప్పాలనుకుంటే ఇది share చేయండి. Surprise అవుతారు 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

image source : news18

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon